సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Jan 27, 2020 , 06:09:40

నేడు కొలువు దీరనున్న కొత్త పాలకులు

నేడు కొలువు దీరనున్న కొత్త పాలకులు

మెదక్‌ ప్రతినిధి,నమస్తేతెలంగాణ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో  సోమవారం ఉదయం 11 గంటలకు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ముందుగా కౌన్సిలర్‌లతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం 12గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు  కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే కౌన్సిలర్‌లకు నోటీసులు ఇచ్చారు. మెదక్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు మెదక్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీల్లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్‌లతో పాటు ఎక్స్‌అఫిసియో సభ్యులుగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులకు ఎమ్మెల్యేలు డిక్లరేషన్‌ ఇచ్చారు. ప్రత్యేక సమావేశం అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక చేతులేత్తే పద్ధతిన ఎన్నికలు నిర్వహించనున్నారు. 


ఈ మేరక జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికల అధికారులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ధర్మారెడ్డి నియమించారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీకి జేసీ నగేశ్‌, మెదక్‌ మున్సిపాలిటీకి డీఆర్డీఏ జిల్లా అధికారి సీతారామారావు, రామాయంపేట మున్సిపాలిటీకి మెదక్‌ ఆర్డీవో సాయిరాం, తూప్రాన్‌ మున్సిపాలిటీకి తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌ను నియమించారు. ఉదయం 11 గంటలకు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30గంటలకు చేతులెత్తే పద్ధతిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. మున్సిపాలిటీకి జేసీ నగేశ్‌, మెదక్‌ మున్సిపాలిటీకి డీఆర్డీఏ జిల్లా అధికారి సీతారామారావు, రామాయంపేట మున్సిపాలిటీకి మెదక్‌ ఆర్డీవో సాయిరాం, తూప్రాన్‌ మున్సిపాలిటీకి తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌ను నియమించారు. ఉదయం 11 గంటలకు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులు  ప్రత్యేక సమావేశాలు  నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30గంటలకు  చేతులెత్తే పద్ధతిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. అన్ని మున్సిపాలిటీలలోని టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎన్నికైన కౌన్సిలర్‌లకు విప్‌ జారీ చేశారు.  సోమవారం నూతన పాలకవర్గాలు నాలుగు మున్సిపాలిటీలలో కొలువు దీరనున్నాయి.  నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్‌లతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేటలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు పార్టీల వారీగా బలబలాలు ఇలా ఉన్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లో సైతం పూర్తి ఆధిక్యతతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఎన్నిక కానున్నారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగుస్తున్నది.


logo