శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 27, 2020 , 06:08:30

71వ గణతంత్ర వేడుకలు

71వ గణతంత్ర వేడుకలు

జిల్లా వ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం అన్ని  ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, పాఠశాలలు, విద్యాసంస్థల ఎదుట మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. దీంతో అన్ని మండలాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రజలందరూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గణతంత్ర  దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఆకట్టుకోగా.. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. 


logo