బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Jan 27, 2020 , 06:07:32

ప్లాస్టిక్‌ కవర్లు వాడితే చర్యలు తప్పవు

ప్లాస్టిక్‌ కవర్లు వాడితే  చర్యలు తప్పవు

నర్సాపూర్‌,నమస్తేతెలంగాణ:  నర్సాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో ప్లాస్టిక్‌ కవర్లు నిషేధం ఉన్నందునా వాడితే  చర్యలు తప్పవని నర్సాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రమణమూర్తి హెచ్చరించారు. ఆదివారం నర్సాపూర్‌ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో మున్సిపల్‌ సిబ్బందితో కలిసి  తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్లో కూరగాయాల వ్యాపారుల వద్ద నుంచి ప్లాస్టిక్‌ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.


చెత్తబుట్టల పంపిణీ 

కొల్చారం: గ్రామాలు బాగుండాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమని శ్రీ చరణ కమ్యూనికేషన్‌ ఎండీ శ్రీనివాస గుప్తా అన్నారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన చిన్నాఘన్‌పూర్‌లో సర్పంచ్‌ ఇందిరాప్రియదర్శినితో కలిసి 600 కుటుంబాలకు 1200 తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస గుప్త మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆలోచన విధానంతో మా గ్రామమైన చిన్నాఘన్‌పూర్‌కు  సేవ చేయాలని తన సొంత ఖర్చులతో నాలుగు వీధిలైట్లు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫర్నీచర్‌, అలాగే పారిశుధ్య సమస్య నివారణకు ఇంటింటికీ చెత్తబుట్టలను పంపిణీ చేశానన్నారు. అలాగే తన సొం త గ్రామంలో గతవారమే అంగడీ(కూరగాయల మార్కెట్‌) ప్రారంభించడం పై   యాభై ఏండ్ల కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ లక్ష్మీనారాయణగౌడ్‌, వార్డు సభ్యులు కమ్మరి మల్లేశ్‌, ఇమ్రాన్‌, బ్రహ్మచా రి, సాతెల్లి ఎల్లం, కీర్తి, వెంకట కృష్ణారెడ్డి, అశోక్‌, పెం టమ్మ వినోద, స్వప్న, కరుణాకర్‌  పాల్గొన్నారు. 


logo
>>>>>>