శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 27, 2020 , 06:06:39

నర్సాపూర్‌ రూరల్‌లో

నర్సాపూర్‌ రూరల్‌లో


నర్సాపూర్‌ రూరల్‌:  చెత్తను ఆరుబయట వేయకుండా చెత్త బుట్టలను వాడాలని ఎంపీడీవో మార్టీన్‌ లూథర్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని నారాయణపూర్‌ గ్రామంలో ఆదివారం ఎంపీడీవో మార్టీన్‌ లూథర్‌ గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత గ్రామస్తుల చేతిలోనే ఉంటుందని పేర్కొన్నారు. చెత్తను ఆరుబయట వేసిన వారికి 500 జరిమానా విధించాలని అధికారులకు సూచించారు. చెత్తను తడిపొడి చెత్తను వేరుచేసి చెత్త బుట్టలో వేసి  రిక్షాలో వేయాలని తెలియజేశారు. ఫ్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్‌ గుప్తా, సర్పంచ్‌ ఇష్రత్‌ ఫాతిమా, ఉపసర్పంచ్‌, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.


రోడ్డు ప్రమాదంలో వృద్ద్ధుడు మృతి, ఒకరికి గాయాలు

మనోహరాబాద్‌ : గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైయ్యేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  ఎస్‌ఐ కమలాకర్‌ వివరాల ప్రకారం... మనోహరాబాద్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన ఎర్ర రాములు, మంద నర్సయ్య (60)లు జీడిపల్లి శివారులోని నర్సరీలో రోజువారి కూలీగా పని చేస్తున్నారు. గణతంత్ర వేడుకల్లో హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం తమ ద్విచక్ర వాహనంపై నర్సరీకి బయలుదేరారు. మార్గమధ్యలో స్థానిక ఐటీసీ పరిశ్రమ సమీపంలో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న కారు  ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన మంద నర్సయ్యను చికిత్స నిమిత్తం సుచిత్రలోని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎర్ర రాములు తీవ్రగాయాలతో మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


logo