శనివారం 28 మార్చి 2020
Medak - Jan 27, 2020 , 06:05:48

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

పాపన్నపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గభవానీ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మంజీరానదిలో  పుణ్యస్నానాలు చేసి దుర్గమ్మను దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు, సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బందులు రాకుండా ఈవో  శ్రీనివాస్‌,సిబ్బంది రవికుమార్‌, సూర్యశ్రీనివాస్‌, సిద్దిపేట శ్రీనివాస్‌, మధుసూదన్‌రెడ్డి,ప్రతాప్‌రెడ్డి  ఏర్పాటు చేశారు. వేద బ్రాహ్మణులు నరసింహాచారి, శంకర్‌శర్మ, పార్థీవశర్మ, రాముశర్మ, రాజశేఖర్‌శర్మ చేశారు. పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు.


నర్సాపూర్‌ రూరల్‌లో

నర్సాపూర్‌ రూరల్‌:  మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వెలసిన శివకేతకీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి ఆలయంలో ఆలయ నిర్మాణ దాత రాధామల్లేశ్‌గౌడ్‌ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధామల్లేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ మాఘమాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి హరిప్రసాద్‌ శర్మ, భక్తులు పాల్గొన్నారు


logo