నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకుడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. రీతూవర్మ, ఐశ్వర్యారాజేష్ కథానాయికలు. టీజర్‌ను మంగళవారం చిత్రబృందం విడుదలచేసింది. కుటుంబ బంధాలను ఆవిష్కరిస్తూ టీజర్ హృద్యంగా సాగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే ‘ఏటికొక్క పూట యానాది పాట’ అనే గీతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాని పాత్ర ైస్టెలిష్‌గా తీర్చిదిద్దారు. ఆయనలోని మాస్ కోణాల్ని పోరాట ఘట్టాల్లో చూపించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘కుటుంబ విలువలు, ప్రేమ, సెంటిమెంట్ కలబోతగా సాగే చిత్రమిది. తనవారి కోసం జగదీష్‌నాయుడు చేసిన పోరాటమేమిటన్నది ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు.
Nani’s ‘Tuck Jagadish’ teaser released