సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Jan 24, 2020 , 04:51:38

27న చైర్మన్ల ఎన్నిక

27న చైర్మన్ల ఎన్నిక
  • -అదేరోజు వైస్‌చైర్మన్ల ఎన్నిక పూర్తి
  • -ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం
  • -తొలుత ప్రమాణం, అనంతరం ఎన్నిక
  • -షెడ్యూల్‌ విడుదల చేసిన ఎస్‌ఈసీ
  • -రేపు ఓట్ల లెక్కింపు..అన్ని ఏర్పాట్లు పూర్తి
  • -కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు


ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. మరికొన్ని గంటల్లో విజేతలెవరో తేలిపోనుంది. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక 27న నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను  ప్రకటించింది.  ఆ రోజున ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో   మొదట సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి అనంతరం చేతులెత్తే పద్ధతిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో  మెదక్‌ మున్సిపాలిటీ చైర్మన్‌కు ఓసీ జనరల్‌కు కేటాయించగా, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌లను బీసీ జనరల్‌కు కేటాయించిన విషయం విదితమే. 
- మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ
మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని మున్సిపల్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. రేపు (25న) మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట ఈ నెల 22న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  కాగా చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. 27న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. కాగా అదే రోజు ఎన్నికల్లో గెలుపొందిన వారికి నోటీసులు కూడా అందిస్తారు. 27న చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్ల ఎంపికకు హాజరుకావాలని ఆ నోటీసులో సూచిస్తారు. అధికారులు సూచించిన 27న చేతులు ఎత్తే పద్దతిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లును ఎన్నుకుంటారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి,  12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. అనంతరం మొదటి సమావేశంలో పాల్గొంటారు.   ఆయా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 75 వార్డులుండగా 73 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 2 వార్డులు టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నాలుగు మున్సిపాలిటీల్లో  చైర్మన్‌ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని టీఆర్‌ఎస్‌ వర్గాలు ధీమాతో ఉన్నాయి. మెదక్‌ చైర్మన్‌ ఓసీ జనరల్‌ స్థానం కాగా నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్లు బీసీ జనరల్‌కు కేటాయించారు.  చైర్‌పర్సన్‌ పదవి కోసం ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో అభ్యరులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.logo