బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Jan 23, 2020 , 01:39:23

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు


రామాయంపేట: రామాయంపేట మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం పట్టణంలోని మున్సిపల్ 12 వార్డులకు గానూ ఎన్నికల అధికారులు 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట భద్రతను చేపట్టారు. మున్సిపల్ అధికారులు సైతం సిబ్బందిని ఎక్కువ సంఖ్యలో పెట్టి ఎప్పటికప్పుడు ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. రామాయంపేట పురపాలికలో మొ త్తం ఓటర్లు 11766 కాగా నేడు పోలైన ఓట్లు మొత్తం 10133, మహిళలు 5252, పురుషులు 4881, 86.12 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 12 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల ప్రత్యేకాధికారి సాయిరాం పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లి 2వ వార్డులో గిరిజనులు ట్రాక్టర్ వచ్చి ఓట్లు వేశారు. అదే పోలింగ్ కేం ద్రంలో ఓటర్లు వందలాదిగా ఉదయమే బారులు తీరారు.

రా మాయంపేట 1, 2వ వార్డులలో సైతం ఓటర్లు అధికంగా వచ్చి చేరారు. హెల్స్ ద్వారా అధికారులు గంటకోమారు పోలిం గ్ సరళిని వాట్సాఫ్ తెలిపారు. బీసీ కాలనీలోని కొంత మం ది వ్యక్తులు వాదులాడుకోవడంతో అక్కడే ఉన్న పోలీసులు సీఐ. నాగార్జునగౌడ్ వారిని వారించి చెదర గొట్టారు. దీంతో ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్ కొనసాగింది. అన్ని పోలింగ్ కేంద్రాలలో ర్యాంపులు ఏర్పాటు చేసి వికలాంగులను, వృద్ధ్దులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, సిబ్బంది ఓటేయించారు. దీంతో పురపాలిక ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది జనరల్ అబ్జర్వర్ జితేష్ పాటిల్

జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగిందని ఎన్నికల జిల్లా జనరల్ అబ్జర్వర్ జితేష్ పాటిల్ అన్నారు. బుధవారం ఎన్నికలు జరుగుతున్న రామాయంపేట పురపాలికను సందర్శించి సిబ్బందిని వివరాలడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు లేవని పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 90 శాతం వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఉన్న సమస్యాత్మక ప్రాంతాలనే పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

తూప్రాన్ రూరల్

తూప్రాన్ రూరల్: తూప్రాన్ మున్సిపాలిటీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది.మున్సిపల్ కమిషనర్ ఖాజామోజియోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... మున్సిపాలిటీ పరిధిలోని తూప్రాన్,అల్లాపూర్, పోతరాజుపల్లి, రావెళ్లి,బ్రాహ్మణపల్లి,పడాల్ 16 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 82.025 శాతంగా పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డు స్థానాల్లో 17,658 మంది ఓటర్లు ఉండగా,వీరిలో 8,830 మంది మహిళలు,8,828 మంది పురుష ఓటర్లున్నారు.17,658 మంది ఓటర్లలో 14,484 మంది బుధవారం జరిగిన ఓటింగ్ పాల్గొన్నారు.వార్డుల వారిగా పరిశీలిస్తే..1వ వార్డులో 1,115 మంది ఓటర్లకు గానూ 859 మంది ఓటింగ్ పాల్గొనగా (77 శాతం),2వ వార్డులో 1,048 మంది ఓటర్లకు గానూ 903 మంది ఓటింగ్ పాల్గొనగా (86 శాతం),3వ వార్డులో 1,133 మంది ఓటర్లకు గానూ 957 మంది ఓటింగ్ పాల్గొనగా (84 శాతం),4వ వార్డులో 1,037 మంది ఓటర్లకు గానూ 726 మంది ఓటింగ్ పాల్గొనగా (70 శాతం),5వ వార్డులో 1,034 మంది ఓటర్లకు గానూ 724 మంది ఓటింగ్ పాల్గొనగా (70 శాతం),6వ వార్డులో 1,041 మంది ఓటర్లకు గానూ 804 మంది ఓటింగ్ పాల్గొనగా (77 శాతం),7వ వార్డులో 1,118 మంది ఓటర్లకు గానూ 1,051 మంది ఓటింగ్ పాల్గొనగా (94 శాతం),8వ వార్డులో 1,160 మంది ఓటర్లకు గానూ 993 మంది ఓటింగ్ పాల్గొనగా (86 శాతం),9వ వార్డులో 1,116 మంది ఓటర్లకు గానూ 995 మంది ఓటింగ్ పాల్గొనగా (89 శాతం),10వ వార్డులో 1,104 ఓటర్లకు గానూ 976 మంది ఓటింగ్ పాల్గొనగా (88 శాతం), 11వ వార్డులో 1,044 మంది ఓటర్లకు గానూ 1,001 మంది ఓటింగ్ పాల్గొనగా (96 శాతం),12వ వార్డులో 1,120 మంది ఓటర్లకు గానూ 853 మంది ఓటింగ్ పాల్గొనగా (76 శాతం),13వ వార్డులో 1,136 మంది ఓటర్లకు గానూ 932 మంది ఓటింగ్ పాల్గొనగా (82 శాతం),14వ వార్డులో 1,059 మంది ఓటర్లకు గానూ 845 మంది ఓటింగ్ పాల్గొనగా (79.79 శాతం),15వ వార్డులో 1,174మంది ఓటర్లకు గానూ 926 మంది ఓటింగ్ పాల్గొనగా (78.87 శాతం),16వ వార్డులో 1,158 మంది ఓటర్లకు గానూ 939 మంది ఓటింగ్ పాల్గొనగా 81 శాతంగా ఓటింగ్ నమోదైంది.

11వ వార్డులో అత్యధికం..4వ వార్డులో అత్యల్పం

తూప్రాన్ మున్సిపాలిటీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. 1,044 మంది ఓటర్లకు గానూ 1,001 మంది ఓటింగ్ పాల్గొనగా 96 శాతం నమోదు కాగా,4వ వార్డులో 1,037 మంది ఓటర్లకు గానూ 726 ఓట్లు పోలయ్యాయని మున్సిపల్ కమిషనర్ ఖాజామోజియోద్దీన్ పేర్కొన్నారు.logo