సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Jan 23, 2020 , 01:33:56

టీఆర్ అభ్యర్థులదే విజయం

టీఆర్ అభ్యర్థులదే విజయం


రామాయంపేట: పురపాలికలో రామాయంపేటలోని 12 వార్డులకు 12 స్థానాలను టీఆర్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ అన్నారు. బుధవారం రామాయంపేటలో గుండెపోటుతో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి టీఆర్ కార్యకర్తలను కలుసుకుని మాట్లాడారు. మున్సిపల్ మున్సిపల్ కార్యాలయంపై గులాబీ జెండాను ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యధిక మెజార్టీతో అభ్యర్థులు గెలుపొందుతారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కస్థానం కూడా రాదన్నారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శ

రామాయంపేట పట్టణంలోని గుండెపోటుతో మృతిచెందిన బాధిత కుటుంబాలను దేవేందర్ పరామర్శించారు. బుధవారం పట్టణంలోని టీఆర్ జిల్లా నాయకుడు మెదక్ మైలవరం రాములు, సాంగని నాగయ్యల కుటుంబాలను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దేవేందర్ వెంట టీఆర్ నాయకులు, పుట్టి విజయలక్ష్మి, ఆత్మకమిటీ చైర్మన్ రమేశ్ అందె కొండల్ పుట్టి యాదగిరి, సరాఫ్ యాదగిరి, పల్లె జితేందర్ దేమె యాదగిరి, బిజ్జ సంపత్, రామకిష్టయ్య, బాదె చంద్రం, నర్సారెడ్డి, ఐలయ్య, పాతూరి సిద్దిరాములు, శ్రీనివాస్, పుట్టి అక్షయ్, శ్యాంసుందర్, సార్గు సత్యం, సిద్దిరాములు, నవాత్ కిరణ్, తోట కిరన్, బాలుగౌడ్, రాములు ఉన్నారు.


logo