మంగళవారం 31 మార్చి 2020
Medak - Jan 22, 2020 , 04:53:57

నేడే పోలింగ్

నేడే పోలింగ్
 • - నాలుగు మున్సిపాలిటీలలో 146 పోలింగ్ కేంద్రాలు
 • - 742 మంది పోలింగ్ సిబ్బంది
 • - 9 మంది జోనల్ అధికారులు
 • - జేసీ పర్యవేక్షణలో పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ
 • - కేటాయించిన కేంద్రాలకు బస్సులలో తరలిన సిబ్బంది
 • - పోలింగ్ కేంద్రాలను పరిశీలించినకలెక్టర్ ధర్మారెడ్డి
 • - అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 50, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 38
 • - ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
 • - రామాయంపేటలో సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్ జితేశ్ పాటిల్
 • - మొత్తం ఓటర్లు 76,818 మహిళలు 38,878, పురుషులు 37,940 మంది
 • - 73 వార్డులు 318 మంది అభ్యర్థుల పోటీ
నర్సాపూర్,నమస్తే తెలంగాణ : పురపోరు తుది దశకు చేరుకున్నది. నేడు జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. మంగళవారం కలెక్టర్ ధర్మారెడ్డి పర్యవేక్షణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అబ్జర్వర్ జితేశ్ వి పాటిల్, కలెక్టర్, జేసీలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అన్ని మున్సిపల్ కేంద్రాల్లో  పోలింగ్ సామగ్రిని అందుకుని, వారికి కేటాయించిన కేంద్రాలకు బస్సులలో తరలివెళ్లారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో 75 వార్డులకు గానూ, 2 వార్డులు ఏకగ్రీవం కాగా 73 వార్డులు రణరంగంలో నిలువగా, 318 మంది బరిలో నిలిచారు. 146 పోలింగ్ కేంద్రాలకు 742 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. నాలుగు మున్సిపాలిటీలలో 76,818 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 38,878, పురుషులు 37,940 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం సూచించిన ఆధార్ పాస్ డ్రైవింగ్ లైసెన్స్, పోస్టాఫీసు బ్యాంకు పుస్తకం, పాన్ వివిధ బ్యాంకుల పాస్ రేషన్  రైతు పట్టాపాసుపుస్తకం, ఫొటో ఐడెంటిటీ తదితర కార్డులలో ఏదైనా ఒక కార్డును తీసుకెళ్లి తమ ఓటును హక్కును వినియోగించుకోవచ్చు. 51  కేంద్రాలను అతిసమస్యాత్మకంగా, 38 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు  ఏర్పాటు చేశారు.            

బుధవారం నర్సాపూర్ పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల వరకు పోలింగ్ ప్రారంభమయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నర్సాపూర్ పట్టణ పరిధిలో మొత్తం 30 పోలింగ్ బూత్ 3జోన్లు 3 రూట్లను ఏర్పాటు చేశారు. 7 పోలింగ్ స్టేషన్లలో వెబ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 210 మంది అధికారులను నియమించారు. 30 మంది ఏపీవోలను 6మంది మైక్రో అబ్జర్వర్లు, ముగ్గురు అబ్జర్వర్లు, ఆర్ 6మంది, ఏఆర్ 6మందిని నియమించారు. అలాగే 7 సమస్యాత్మక ప్రాంతాలను ఎంపిక చేసి వెబ్   ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొంటున్నారు.

14వేల 155 మంది ఓటర్లు..

నర్సాపూర్ పట్టణ పరిధిలో 15వార్డులు ఉన్నాయి. 14వేల 155 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7069   మంది ఓటర్లు, మహిళలు 7086 మంది ఉన్నారు. అయితే నడవలేని వికలాంగుల కోసం పోలింగ్ స్టేషన్ వరకు వెళ్లడానికి వీల్ చైర్ ఏర్పాటు చేశారు. మద్యం తాగి పోలింగ్ కేంద్రాలకు వస్తే ఎట్టిపరిస్థితులలో అనుమతించమని ఇప్పటికే అధికారులు చెప్పారు.

డీఎస్పీ కిరణ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు..

ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసు సిబ్బందిని నియమించారు. బుధవారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం తూప్రాన్ డీఎస్పీ కిరణ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మంగళవారం పోలీసు సిబ్బందికి తగు సలహాలు, సూచనలు చేశారు. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు 6 మంది ఎస్ 45 మంది పోలీసు కానిస్టేబుల్ 20 మంది హోంగార్డులను నియమించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కిరణ్ మాట్లాడుతూ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని పోలీసులకు సూచించారు. పాతపద్ధతి బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ సక్రమంగా జరిగే విధంగా చూడాలని ఎట్టి పరిస్థితులలో బైపోల్ జరుగడానికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

పోలింగ్ బాక్సుల పంపిణీని పర్యవేక్షించిన జిల్లా నోడల్ అధికారి రాజిరెడ్డి..

బుధవారం జరిగే నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా  నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో  ఎన్నికల ఏర్పాట్లను పోలింగ్ బాక్సుల పంపిణీ  కార్యక్రమానికి జిల్లా నోడల్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి, మేనేజర్ శ్రీహరిరాజులు పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్, తాగునీరు, ర్యాంపులు  ఇతర సౌకర్యాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం జిల్లా నోడల్ అధికారి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కేంద్రాల వద్ద ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పోలింగ్ బాక్సుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకుడు జితేశ్ పరిశీలించి ఎన్నికల అధికారులకు సూచనలు చేశారు. 

మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన

తూప్రాన్ రూరల్ / మనోహరాబాద్ : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేవిధంగా ప్రత్యేక చొరవ చూపించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు జితేశ్ మున్సిపల్ కమిషనర్ ఖాజామొజియొద్దీన్ సూచించారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట శివారులోని నోబుల్ ఫార్మసి కళాశాలో మంగళవారం ఎన్నికల్లో పాల్గొననున్న పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని ఆర్వో (రిటర్నింగ్ ఆఫీసర్)లు, ఏఆర్వో (అసిస్టెంట్ రిటర్నింగ్ అసిస్టెంట్) లు అందజేశారు. అయితే జిల్లా ఎన్నికల అబ్జర్వర్ జితేశ్ పాటిల్ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ బాక్సులు ఎలా ఉన్నాయో ఆయన నిశితంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ముగిసేంత వరకు విధి నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా జాగత్తగా వ్యవహరించాలన్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించే విధంగా కృషి చేయాలని కమిషనర్ ఆయన ఆదేశించారు.logo
>>>>>>