శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Medak - Jan 21, 2020 , 00:37:03

నర్సాపూర్‌ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలి

నర్సాపూర్‌ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలినర్సాపూర్‌, నమస్తే తెలంగాణ : అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని, నర్సాపూర్‌ పట్టణ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి కోరారు. సోమవారం నర్సాపూర్‌ పట్టణంలోని మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ వార్డు అభ్యర్థి అశోక్‌గౌడ్‌, 2వవార్డు అభ్యర్థి హన్మంతు రోజా, 3వ వార్డు అభ్యర్థి ఇస్రత్‌ సిద్దిఖా, 6వ వార్డు అభ్యర్థి  నయిమొద్దీన్‌, 7వ వార్డు అభ్యర్థి గొల్ల రుక్కమ్మ, 8వవార్డు అభ్యర్థి తొంట వెంకటేశ్‌, 9వ వార్డు అభ్యర్థి ఆశన్నగారి మంజుల, 10వ వార్డు అభ్యర్థి నాగరాజుగౌడ్‌, 13వ వార్డు అభ్యర్థి మురళీయాదవ్‌లకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. కారు గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. 13వ వార్డులో ఓపెన్‌టాప్‌ వాహనం ఎక్కి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే నర్సాపూర్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఇప్పటికే నర్సాపూర్‌ మున్సిపల్‌ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వాటితో పట్టణంలో అవసరం ఉన్న చోట ఖర్చు చేసి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నర్సాపూర్‌ పట్టణం జాతీయ రోడ్డుతో రూపురేఖలు మారాయని చెప్పారు. పట్టణంలో 500 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, అర్హులైన వారికి కేటాయిస్తామన్నారు. ఈ నెల 22న జరిగే పోలింగ్‌లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, నర్సాపూర్‌ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు, మల్లేశ్‌గౌడ్‌, వెంకటరమణరావు, రామాగౌడ్‌, జెడ్పీటీసీలు శేషసాయిరెడ్డి, మేఘమాల, బాబ్యానాయక్‌, కవితా, జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు మన్సుర్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకుడు శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.logo