శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 21, 2020 , 00:35:49

టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి

టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి


రామాయంపేట : రామాయంపేట మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని వార్డులు గెలుస్తుందని ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, నిజాంపేట జెడ్పీటీసీ పంజ విజయ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం రామాయంపేట పట్టణంలోని మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు మద్దతుగా వార్డులలో ప్రచారం చేపట్టి ఓటర్లనుద్దేశించి మాట్లాడారు. కచ్చితంగా రామాయంపేట మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే విజయఢంకా మోగిస్తారన్నారని అన్నారు. కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌, బీజేపీలు ఎంత మంది వచ్చినా ప్రజల మద్దతు సీఎం కేసీఆర్‌కే ఉంటుంద న్నారు. గడచిన ఐదేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తున్నదన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రామాయంపేటకు అత్యధిక నిధులను తెచ్చి న ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. మున్సిపల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తే వార్డుల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టి యాదగిరి, సరాఫ్‌ యాదగిరి, పల్లె జితేందర్‌గౌడ్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌, రమేశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్‌, బాదె చెంద్రం, ఐలయ్య, అమరసేనారెడ్డి, ఎదుగని వెంకటేశం, కొమ్మాట బాబు, సార్గు లక్ష్మణ్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.


logo