గురువారం 09 ఏప్రిల్ 2020
Medak - Jan 20, 2020 , 02:36:32

పోలియో రహిత జిల్లాగా మార్చాలి

పోలియో రహిత జిల్లాగా మార్చాలి


తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం జెడ్పీచైర్‌పర్సన్‌ హేమలత చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామొజియొద్దీన్‌, పీహెచ్‌సీ డాక్టర్‌ ఆనంద్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

మెదక్‌లో...

మెదక్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రమైన మెదక్‌లోని చర్చి గేట్‌ వద్ద  కలెక్టర్‌ ధర్మారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు పోలియో చుక్కలను తప్పకుండా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిద్దిదాలని అన్నారు. జిల్లాలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రాంతాల్లో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నారులకు చుక్కలు వేయాలని తెలిపారు. జిల్లాలో మొదటి రోజు ఆదివారం 94.5 శాతం నమోదైందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. జిల్లాలో 75,490 మంది చిన్నారులను గుర్తించగా, ఆదివారం ఒక్క రోజే 71,338 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. మిగతా వారికి 20, 21, 22వ తేదీల్లో ఇంటింటికీ తిరుగుతూ చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తామని చెప్పారు. 523 బూత్‌లకు గానూ 2092 మంది ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీలు, ఆశాలు, వలంటీర్లను నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో 23 పాయింట్లను ఏర్పాటు చేశామని, ఇందులో 53 మంది సూపర్‌వైజర్లు అన్ని రూట్లలో వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సుమిత్రారాణి, ఇర్షాద్‌, నవీన్‌, అనిల, చంద్రశేఖర్‌, మణికంఠ, శ్రావణి, విశాల్‌, సంతోష, పవన్‌, ఆరోగ్య కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రం దవాఖానలో...

జిల్లా కేంద్రం దవాఖానలో దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు అని అన్నారు. తల్లిదండ్రులు తప్పకుండా చిన్నారులకు పోలియో చుక్కలను వేయించాలని సూచించారు. పోలియో చుక్కలను జిల్లా కేంద్రం దవాఖానలో అందుబాటులో ఉంచామన్నారు.

పల్స్‌పోలియోను తరిమేయాలి

నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ: పోలియోను తరిమేయాలంటే చిన్నారు లకు పోలియో చుక్కలను వేయించాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నా రు. ఆదివారం నర్సాపూర్‌ పట్టణంలోని 7వార్డులో చేపట్టిన పల్స్‌పోలియో కా ర్యక్రమంలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే మ దన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డిలు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్క లను  వేశారు. అలాగే ఎన్‌జీవో కాలనీతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌ ప్రాంతంలో వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ కార్యక్రమంలో వై ద్యసిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

రామాయంపేటలో...

రామాయంపేట: పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి లక్ష్మణ్‌సింగ్‌ అన్నారు. ఆదివారం రామాయంపేట మండల కేంద్రంతో పాటు దామరచెర్వు, ఎస్సీ కాలనీ తదితర గ్రామాలలో పోలియో చుక్కలు వేసి మాట్లాడారు. 0-5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కలను వేస్తున్నామన్నారు. పోలియో చుక్కలు వేయడం వలన చిన్నారులు  ఆరోగ్యంగా ఉంటారన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తల్లితండ్రులు జాగ్రత్తలను పాటించాలన్నారు. రామాయాంపేట పట్టణంతో పాటు అన్ని గ్రామాలలో ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆయా గ్రామాలలో సర్పంచ్‌, ఎంపీటీసీల ద్వారా పోలియో చుక్కలను వేయించారన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు నర్సాగౌడ్‌, చంద్రకళ, పంబాల జ్యోతి, ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది, రవీందర్‌,వెంకటేశ్వర్‌రావు ఉన్నారు. logo