శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Jan 19, 2020 , 00:50:57

లోకకల్యాణార్థం.. నవచండీయాగం

 లోకకల్యాణార్థం.. నవచండీయాగం


కౌడిపల్లి : లోక కల్యాణార్థం కౌడిపల్లిలోని అభయ రామాలయంలో మహా నవచండీ యాగాన్ని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి సహకారంతో వైభవంగా నిర్వహించారు.  శనివారం తెల్లవారు జామునుంచే మాధవానంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటగా గణపతి పూజ నిర్వహించి సీతారామచంద్ర స్వామికి 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. సీతామచంద్ర స్వామికి లక్ష తులసి, లక్ష పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నవచండీ యాగాన్ని వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య జరిపారు. చండీమాతకు ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతిని నిర్వహించారు. అనంతరం సీతారామచంద్ర స్వామికి కల్యాణమహోత్సవం, మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని  నిర్వహించారు.

వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సుజాతమ్మ దంపతుల ఆధ్వర్యంలో మహా నవ చండీయాగం జరిగింది. వచ్చే సంవత్సరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అభయరామాలయంలోనే మహా శతచండీ యాగాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ‘కాళేశ్వరం’ నుంచి ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే లక్ష్యమన్నారు. నవచండీ యాగానికి సహకరించిన మాధవానంద సరస్వతీస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన పురోహితులు, వలంటీర్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కారక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వాకిటి సునీతారెడ్డి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చిలుముల యశోదమ్మరంగారెడ్డి, చిలుముల ఇందిరావెంకటేశ్వరరెడ్డి, చిలుముల శకుంతలదుర్గారెడ్డి, మమతాదేవేందర్‌రెడ్డి, స్వేతారాంరెడ్డి, సారికాశ్రీనివాస్‌రెడ్డి, దీపికవెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హంసీబాయి, జెడ్పీటీసీ కవితా, తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చిలుముల ప్రతాప్‌రెడ్డి, ప్రధాన పురోహితులు రఘుశర్మ, వేద శ్రీనివాస్‌శర్మ, ఆంజనేయశర్మ, కొలచాల రాజేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.logo