సోమవారం 30 మార్చి 2020
Medak - Jan 18, 2020 , 00:27:48

ప్రచారంలో గులాబీ దూకుడు

ప్రచారంలో గులాబీ దూకుడు


రామాయంపేట :  టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పార్టీ పోరాడి తెలంగాణను తెచ్చుకున్నాం.. ప్రతిపక్ష పార్టీల ప్రలోభాలకు గురికావొద్దని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రామాయంపేటకు విచ్చేసిన మంత్రి పట్టణంలోని అన్ని వార్డులలో రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజీపీలకు ప్రణాళిక అంటూ ఏమి లేదు ప్రజలను మోసం చేయడమే వారి నైజం వారి మాటలను వినొద్దు. ఎళ్లవేళలా ప్రజలకు దగ్గరగా ఉండేది టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కటి మాత్రమే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. రోజుకు 24 గంటల కరంట్‌ ఇస్తుంది. టీఆర్‌ఎస్‌ ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ మన హైకమాండ్‌ ఢిల్లీలో కాదు మన గల్లీలోనే ఉన్నది. మనకు ఏ అవసరం వచ్చినా భయపడేది లేదు మీ దగ్గరకు వచ్చి పనులు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి పథకాన్ని అందజేసి ఆడబిడ్డల తల్లితండ్రులకు భరోసా కల్పిస్తుందన్నారు. బిడ్డ పుడితే కాన్సుకు కేసీఆర్‌ కిట్టును ఇచ్చి ఖర్చు లేకుండా ఇంటికే వాహనం ద్వారా తోలిస్తున్నదన్నారు. రామాయంపేటకు మంజీరా నీటిని త్వరలోనే తెప్పిస్తామన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్ల రూపంలో రూ.900 కోట్లను ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. నిరుపేద విద్యార్థుల చదువు కోసం 500 పైగా రెసిడెన్షియల్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను త్వరలోనే అందజేస్తామని అన్నారు. రామాయంపేటలో ప్రస్తుతం 300 ఇండ్లు పూర్తి అయ్యాయన్నారు. 

రామాయంపేటను దత్తత తీసుకుని అభివృద్ది చేస్తా..

రామాయంపేటను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మంత్రి అన్నారు. రామాయంపేట పట్టణంలోని 12 వార్డులను  అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 12 మందిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు మీ వెంటే ఉంటారు. మల్లెచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా చేస్తామన్నారు.

రామాయంపేట మున్సిపాలిటీకి అధిక నిధులు..: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

రామాయంపేట పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రామాయంపేటలో రోడ్‌ షో  ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేనంతగా రామాయంపేట అభివృద్ధికి అధిక నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందన్నారు.

పట్టణ ప్రగతిలో రామాయంపేట మరింత అభివృద్ధి..: ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి  

త్వరలోనే ప్రభుత్వం పట్టణ ప్రగతి ద్వారా రామాయంపేటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతితో పట్టణంలోని రోడ్లు, మురికి కాల్వలను పరిశుభ్రం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి రాధాకృష్ణ శర్మ, టీఆర్‌ఎస్‌ రామాయంపేట మండల అధ్యక్షుడు పల్లె జితేందర్‌గౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌, మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, రెండు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు పంజ విజయ్‌కుమార్‌, సంధ్య, నార్సింపేట భిక్షపతి, దేశెట్టి సిద్ధిరాములు, ఆత్మ కమిటీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పుట్టి యాదగిరి, సరాఫ్‌ యాదగిరి, దేమె యాదగిరి, అందె కొండల్‌రెడ్డి, బాదె చంద్రం, నర్సారెడ్డి, బిజ్జ సంపత్‌, శారద రాజు, లక్ష్మణ్‌ యాదవ్‌, నరేందర్‌రెడ్డి, కిష్టారెడ్డి, పోచమైన ఐలయ్య, అక్షయ్‌ కుమార్‌, ఎంపీటీసీ బాల్‌రెడ్డి, నగేశ్‌ యాదవ్‌, సంగు స్వామి, సుధాకర్‌రెడ్డి, ఇమ్మానియేల్‌, మల్లేశం, దేవుని రాజు, సరాఫ్‌ శామ్‌సుందర్‌, తదితరులున్నారు.logo