శనివారం 28 మార్చి 2020
Medak - Jan 16, 2020 , 23:18:20

సంతోషంగా ‘సంక్రాంతి’

సంతోషంగా ‘సంక్రాంతి’
  • -పండుగ ముగ్గుల్లోనూ కారు బొమ్మలు..
  • -ప్రభుత్వ పథకాలతో అందమైన రంగవల్లులు
  • -వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న జిల్లావాసులు

సంక్రాంతి పండుగను జిల్లావాసులు ఘనంగా జరుపుకున్నారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌పై ఉన్న ఇష్టాన్ని, ప్రభుత్వ పథకాల  గొప్పతనాన్ని  ముగ్గు రూపంలో వేసి అభిమానాన్ని చాటుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కొందరు తమ ఇండ్ల ఎదుట కారు బొమ్మను ముగ్గుగా వేయగా, మరికొందరు  ఇంకుడుగుంతలు, హరితహారం, తడి, పొడి చెత్తను వేరుచేయడం వంటి అనేక అంశాలను ముగ్గులుగా మలచి ప్రభుత్వంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
- మనోహరాబాద్‌/చిలిపిచెడ్‌

మనోహరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘పల్లెప్రగతి’ ప్రతి ఒక్కరిలో నాటుకుపోయింది. మొదటి, రెండో విడుత ‘పల్లెప్రగతి’ పనులతో గ్రామస్తులు, యువకుల్లో చైతన్యం నింపింది. ఆయా గ్రామాల్లో రెండు విడుతల్లో ప్రజలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా పోతారం, పర్కిబండ గ్రామాల్లో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ముగ్గుల పోటీలను నిర్వహించారు.

ఇందులో ఎక్కువ శాతం యువతులు సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. పల్లెప్రగతి, సేవ్‌ దీ గల్స్‌, ఇండియన్‌ ఆర్మీ, ఇంకుడుగుంతల ముగ్గులను వేశారు. తూప్రాన్‌లో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలంటూ పర్కిబండ గ్రామానికి చెందిన పూల రమ్య ముగ్గు వేశారు. దీంతో పాటు ‘ పల్లెప్రగతి-స్వచ్ఛ పర్కిబండ’ పేరుతో ఇంకుడుగుంత నమూనాను వివరించే మరో ముగ్గును వేశారు. ఇదిలా ఉండగా పలు రకాల ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీలత, సర్పంచులు అర్జున్‌, మాధవరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, భారీ సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.  

చిలిపిచెడ్‌లో..

చిలిపిచెడ్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి పండుగా ఘనంగా నిర్వహించారు. ఈ పండుగా సందర్భంగా మహిళలు, చిన్న పిల్లలు వివిధ రకాల ముగ్గులు వేశారు. మండలంలోని అజ్జమర్రి గ్రామంలో మాజీ సర్పంచ్‌ నగేశ్‌యాదవ్‌ ఇంటి వద్ద ముగ్గుతో పాటు టీఆర్‌ఎస్‌ అని రాసి ముగ్గువేశారు.

గౌతాపూర్‌లో..

సంక్రాంతిని పురస్కరించుకుని గౌతాపూర్‌ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ స్వరూప విఠల్‌ ఆధ్వర్యంలో గ్రామంలో మంచిగా ముగ్గులు వేసిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సుగుణమ్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.logo