గురువారం 09 ఏప్రిల్ 2020
Medak - Jan 15, 2020 , 03:04:24

73 వార్డులు 918 మంది

73 వార్డులు 918 మంది


మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 75 వార్డులకు గాను, 02 వార్డులు ఏకగ్రీవం కాగా 73 వార్డులలో 318 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులకు గాను రెండు వార్డుల్లో  టీఆర్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 30 వార్డులకు పోటీ జరుగనున్నది. 30 వార్డుల్లో టీఆర్ 30, బీజేపీ 22, కాంగ్రెస్ 30, ఎంఐఎం 04, సీపీఐ(ఎం) 01, జనసమితి 01, స్వతంత్రులు 26 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను టీఆర్ 15, కాంగ్రెస్ 15, బీజేపీ 13, సీపీఐ 01, సీపీఐ(ఎం) 01, టీడీపీ 01, ఎంఐఎం 03, స్వతంత్ర అభ్యర్థులు 19 మంది పోటీ పడుతున్నారు. తూప్రాన్ 16 వార్డులకు గాను టీఆర్ 16, కాంగ్రెస్ 15, బీజేపీ 10, టీడీపీ 03, స్వతంత్ర అభ్యర్థులు 35 మంది పోటీ పడుతున్నారు. రామాయంపేటలో 12 వార్డులకు గాను టీఆర్ 12, కాంగ్రెస్ 11, బీజేపీ 11, సీపీఐఎం 01, సమాజ్ పార్టీ(ఎస్ 02, స్వతంత్ర అభ్యర్థులు 20 మంది పోటీ పడుతున్నారు. నామినేషన్ల గడువు ఉపసంహరణ చివరి రోజు మంగళవారం వరకు నాలుగు మున్సిపాలిటీల్లో 410 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 


మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నాలుగు మున్సిపాలిటీల్లో పలు పార్టీల నుంచి నామినేషన్లు వేసిన అభ్యర్థులు 410 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మెదక్  202 మంది, నర్సాపూర్ 77 మంది, తూప్రాన్ 62 మంది, రామాయంపేటలో 69 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో జిల్లా మొత్తంగా నాలుగు మున్సిపాలిటీలో టీఆర్ పార్టీ అన్నీ వార్డుల్లో పోటీ చేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలకు ఆయా వార్డుల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. టీఆర్ 73, కాంగ్రెస్ 71, బీజేపీ 56, టీడీపీ 04, స్వతంత్రులు 100, ఎంఐఎం 07, ఎస్ 02, సీపీఐ 01, సీపీఐ(ఎం) 03, జనసమితి 01 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంగళవారం నామినేషన్ ఉపసంహరణ కేంద్రాలను కలెక్టర్ ధర్మారెడ్డి  పరిశీలించారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గుర్తుల కేటాయింపుల్లో జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.


 ఇదిలా వుండగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న టీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. నర్సాపూర్ టీఆర్ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే మదన్ ప్రకటించారు. తూప్రాన్ ఎంపీ కొత్త ప్రభాకర్ జెడ్పీ చైర్ హేమలతాశేఖర్ అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్, వంటేరు ప్రతాప్ ఎలక్షన్ టీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆయా మున్సిపాలిటీలలో టీఆర్ పార్టీ బీఫాంలను పార్టీ నాయకులు అధికారులకు అందించారు. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడం, అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి ఆయా పార్టీలు బీఫాంలు అందించడంతో పోటీలో ఉండే వివిధ పార్టీల అభ్యర్థుల జాబితా తేటతెల్లమైంది. రేపటి నుంచే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోనున్నారు.


logo