గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Jan 15, 2020 , 03:00:32

టీఆర్ అభ్యర్థులకు బీ ఫాంలు అందజేత

టీఆర్ అభ్యర్థులకు బీ ఫాంలు అందజేత

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ తరఫున పోటీ చేస్తున్న 5 మంది అభ్యర్థులకు మంగళవారం బీ ఫాంలను అందచేశారు. అయితే సోమవారం 10 మంది అభ్యర్థులకు బీ ఫాంలను అందచేయగా మంగళవారం 1వ వార్డు నుంచి దుర్గప్పగారి అశోక్ గౌడ్, 3వ వార్డు నుంచి ఇస్రత్ సిద్దిఖా, 7వ వార్డు నుంచి గొల్ల రుక్కమ్మ, 10వ వార్డు నుంచి దుర్గప్ప గారి నాగరాజు గౌడ్, 13వ వార్డు నుంచి ఎర్రగొల్ల మురళీయాదవ్ బీ ఫాంలను అందజేశారు. ఈ బీ ఫాంలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, టీఆర్ నర్సాపూర్ ఇన్ దేవేందర్ ఆధ్వర్యంలో మున్నిపల్ అధికారులకు అందజేశారు.  


logo
>>>>>>