గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Jan 14, 2020 , 02:27:32

అభివృద్ధి, సంక్షేమ పధకాలను గడప గడపకు తీసుకెళ్లండి

 అభివృద్ధి, సంక్షేమ పధకాలను గడప గడపకు తీసుకెళ్లండి
  • -లబ్ధిదారులను నేరుగా కలిసి ఓట్లు వేయించండి
  • -మెదక్‌, రామాయంపేట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురాలి
  • -టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
  • -మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక భేటీ
  • -పాల్గొన్న ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి
  • - మెదక్‌, రామాయంపేట మున్సిపల్‌ ఎన్నికలపై చర్చ
  • -అభ్యర్థుల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘సంక్షేమ, అభివృద్ధి పథకాలను గడప గడపకు తీసుకెళ్లండి.... ప్రతి లబ్ధిదారుడిని కలువాలి... ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయండి... సమన్వయంతో పని చేసి నాలుగు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగురవేయాలి’ అని టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డిలకు సూచించారు. సోమవారం మంత్రి కేటీఆర్‌తో  మెదక్‌, రామాయంపేట మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి  ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి   ప్రత్యేకంగా కలువగా, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలనూ తెలుసుకున్నారు. పార్టీ నుంచి రెబల్‌ అభ్యర్థులు పోటీలో ఉండకుండా కార్యకర్తలు, నాయకులతో చర్చించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సూచించారు.   మున్సిపల్‌ ఎన్నికల కార్యచరణపై క్షేత్రస్థాయి ప్రచారం,  అభ్యర్థుల ఎంపిక, పార్టీ విజయం కోసం అనుసరిస్తున్న వ్యూహాలపై మంత్రి చర్చించారు. నామినేషన్ల ఉపసంహరణల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో  టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు.logo
>>>>>>