శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 14, 2020 , 02:24:42

గెలుపే లక్ష్యంగా..

గెలుపే లక్ష్యంగా..
  • -భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకుందాం
  • -గజ్వేల్‌లో 20, తూప్రాన్‌లో 16 వార్డుల్లో విజయం సాధించాలి
  • -జెడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌, రాష్ట్ర ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి
  • -మనోహరాబాద్‌లో పార్టీ అభ్యర్థులకు బీఫాంల అందజేత వార్డులలో సర్వేలు చేయిస్తున్నాం..
  • -ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి
  • -నర్సాపూర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫాంల అందజేత

మనోహరాబాద్‌ / తూప్రాన్‌ రూరల్‌ : అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలగాలని జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌లో జెడ్పీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డితో కలిసి తూప్రాన్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు బీ ఫాంలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గజ్వేల్‌, తూప్రాన్‌ మున్సిపాలిటీలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులదేనన్నారు. పార్టీలో ప్రతి నాయకుడికి గుర్తింపు ఉంటుందన్నారు. గజ్వేల్‌లో 20, తూప్రాన్‌లో 16 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురడం తథ్యమన్నారు. రెబల్స్‌ అభ్యర్థులు పోటీలో లేకుండా చూస్తున్నామన్నారు. అనంతరం తూప్రాన్‌లో 6వ వార్డులో పట్లూరి సుమీల శ్రీనివాస్‌రెడ్డి, 4వ వార్డులో మామిండ్ల జ్యోతికృష్ణ, 7వ వార్డులో దుర్గం కిషన్‌, 8వ వార్డులో బుర్గుల లావణ్య దుర్గారెడ్డి, 13వ వార్డులో నందాల శ్రీనివాస్‌, 16వ వార్డులో కోడిప్యాక నారాయణ గుప్తా, 10వ వార్డులో చింత రవీందర్‌రెడ్డి, 9వ వార్డులో భానపురం రాజు, 15వ వార్డులో ఆర్‌.శ్రీశైలంగౌడ్‌లకు బీ ఫాంలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీ ఫాంలు అందజేత

నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ :  టీఆర్‌ఎస్‌ తరఫున నర్సాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులకు సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీయాదవ్‌, నర్సాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి బక్కివెంకటయ్యలు బీ ఫాంలను అందచేశారు. 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్న హన్మంతు రోజారమణి, 4 వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎరుకల యాదగిరి, 5వ వార్డు నుంచి మాచునూరి రాజుయాదవ్‌, 6వ వార్డు నుంచి నహీమొద్దీన్‌, 8వ వార్డు నుంచి తొంట వెంకటేశ్‌, 9వ వార్డు నుంచి ఆశన్నగారి మంజుల, 11వ వార్డు నుంచి పద్మజ్ఞానేశ్వర్‌, 14వ వార్డు నుంచి తంగెడుపల్లి సరిత, 15వ వార్డు నుంచి పంబళ్ల లలితలకు బీ ఫాంలు అందుకున్నారు. మిగితా 1, 3, 7, 10, 13 వార్డులలో సర్వేలు జరుగుతున్నాయని మంగళవారం పైనల్‌ చేసి వారికి అందచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నర్సాపూర్‌ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకటరమణరావు, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు హబీబ్‌ఖాన్‌, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.


logo