బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Jan 14, 2020 , 02:22:30

ఫ్రెండ్లీ పోలీస్‌తో వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది

ఫ్రెండ్లీ పోలీస్‌తో వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది
  • -హైదరాబాద్‌ వెస్టు జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర
అల్లాదుర్గం: ఫ్రెండ్లీ పోలీసుతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం ఏర్పడిందని హైదరాబాద్‌ వెస్టు జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు.సోమవారం అల్లాదుర్గం సర్కిల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.సర్కిల్‌ పరిధిలోని టేక్మాల్‌, పెద్దశంకరంపేట ,రేగోడ్‌, అల్లాదుర్గం పలు రికార్డులతో పాటు నేరాల వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.గతంలో పోలీసులంటే ప్రజలు భయపడేవారని ప్రస్తుతం అలా కాకుండా ప్రజల్లో ఉన్న భయాన్ని ఫ్రెండ్లీ పోలీస్‌తో పోగొట్టి ప్రజలకు దగ్గరయ్యామన్నారు.స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.ప్రజలు సైతం పోలీసులతో స్నేహాపూరితంగా వ్వవహరిస్తున్నారన్నారు. అల్లాదుర్గం సర్కిల్‌ నూతనంగా ఏర్పడడంతో తాత్కాలిక భవనంలో  కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.పక్కా భవనం కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.అల్లాదుర్గంలో పోలీస్టేషన్‌లో భవన నిర్మాణాల కు కృషి చేస్తానన్నారు.

మొక్కలు పెంచడం చాలా ముఖ్యం: ఎస్పీ చందన దీప్తి

మానవజాతి మనుగడకు ప్రాణవాయువు ఎంతో ముఖ్యమని,అటువంటి ప్రాణ వాయువును విడుద ల చేసే పచ్చని చెట్లు పర్యావరణానికి దోహదం చేస్తాయని ఎస్పీ చందనదీప్తి అన్నారు.సోమవారం అల్లాదుర్గం సర్కిల్‌ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటి నీరు పోశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ఖాళీగా ఉన్న స్థలాల్లో  చెట్లు పెంచడం చాలా ముఖ్యమన్నారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.రాబోయో హరితహారం కార్యక్రమంలో పోలీసులు పాల్గొని మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.కార్యక్రమంలో మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి,సీఐ రవి, అల్లాదుర్గం, రేగోడ్‌, పెద్దశంకరంపేట, టేక్మాల్‌ ఎస్సైలు మోహన్‌రెడ్డి,కాశీనాథ్‌, సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


logo