బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Jan 14, 2020 , 02:21:03

భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సమానం

భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సమానం
  • - మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
  • - ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ

మెదక్‌ అర్బన్‌: శాంతి సామరస్యంతో ఉన్న భారతదేశంలో మత విద్వేశాలను రెచ్చగొట్టేందుకు బీజే పీ ప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్సీ చట్టాలను తీసుకువస్తుందని  ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో  మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రిస్టల్‌ గార్డెన్‌ వద్ద  ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఇష్రత్‌ ఆలీ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన బహింరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగం , విద్య, వైద్యం, నోట్లరద్దు వంటి వాటిపై అలోచించకుండా కేవలం మతం ఆధారంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు మతాలను దేశంలో విడగొట్టెందుకు ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షా కుట్రలు పన్నుతున్నార ని వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, వంటి చట్టాలను తీసుకువచ్చి హిందూ-ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. భారతదేశంలోని శాంతి, సామరస్యం ఉండాలని ఎంఐఎం కోరుకుంటుందని తెలిపారు. కేంద్ర ంలో మోడీ ప్రభుత్వం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్‌ఆర్సీని కేరళ ప్రభుత్వంలాగా మన రాష్ట్రంలో కూడా అమలు కాకుండా చూడాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పూర్తి నమ్మకం ఉందని అన్నారు.  పట్టణంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కార్వన్‌ ఎమ్మెల్యే , కార్పొరేటర్‌ నిసార్‌, మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి కీసర్‌ మొహినొద్దీన్‌, మౌలానా, జెమిలీ,అసీఫ్‌  పాల్గొన్నారు.


logo
>>>>>>