శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 13, 2020 , 03:24:41

ప్రతీ పల్లె.. ’ప్రగతి’ బాట

ప్రతీ పల్లె.. ’ప్రగతి’ బాట
  • - పల్లెప్రగతిలో రూపురేఖలు మారిన గ్రామాలు
  • - ముగిసిన రెండో విడుత పల్లె ప్రగతి
  • -10 రోజుల పాటు జోరుగా కొనసాగిన కార్యక్రమం
  • - పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలకు కొత్తరూపు
  • చివరి రోజు పలు చోట్ల పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్‌ కలెక్టర్‌, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

రెండో విడుత పల్లెప్రగతి కార్యక్రమానికి ప్రజలు నీరాజనం పలికారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి రెండో విడుత కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.  సుమారు 6 లక్షల మందికి పైగా శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ నెల 2వ తేదీన మొదలైన పల్లె ప్రగతి రెండో విడుత కార్యక్రమం ఆదివారంతో ముగిసింది.  ముఖ్యంగా పారిశుధ్యం, మొక్కల పెంపకాన్ని ప్రధాన అంశాలుగా తీసుకున్నారు. ప్రమాదకర బావులను పూడ్చివేశారు.    పల్లె ప్రగతి చివరి రోజు శివ్వంపేట మండలం బిజిలిపూర్‌ గ్రామంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మనోహరాబాద్‌లో జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, కలెక్టర్‌ ధర్మారెడ్డి  పాల్గొన్నారు. 
    - మెదక్‌ మున్సిపాలిటీ

మనోహరాబాద్‌ : గ్రామస్తుల సమష్టి కృషితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, కలెక్టర్‌ ధర్మారెడ్డిలు పేర్కొన్నారు. ‘పల్లె ప్రగతి’ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మనోహరాబాద్‌, గౌతోజిగూడెం గ్రామాల్లో పాల్గొని స్వచ్ఛతపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ మొక్కను నాటిన అనంతరం మాట్లాడారు. పల్లె ప్రగతి పనులను ఇదే స్ఫూర్తితో నిరంతరం కొనసాగించాలన్నారు. కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతలో అందరి భాగస్వామ్యంతోనే గ్రామాలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ‘ఒక సర్పంచ్‌, పది మంది కార్మికులు గ్రామాన్ని మొత్తం శుభ్రం చేయలేరు కదా... మీరు ఇంటి వద్ద శుభ్రంగా ఉంచుకుంటే చాలు... గ్రామం మొత్తం శుభ్రంగా ఉంటుందని వివరించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. ప్రతి ఇంటికీ కనీసం ఐదు మొక్కలను నాటాలన్నారు. ప్రతి గ్రామంలో వారంలో ఒక రోజు శ్రమదానం చేయాలని సూచించారు. చెత్త సేకరణ రిక్షాలు రావడం లేదని మహిళలు తెలుపడంతో ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్డు వెడల్పు పనులు జరుగడం లేదని, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని సర్పంచ్‌ మహిపాల్‌రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్‌ త్వరలోనే పనులను పూర్తి చేయిస్తానని తెలిపారు. మహిళా సంఘం భవనం మంజూరు చేయాలని కోరగా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. 

స్వచ్ఛతలో గౌతోజిగూడ భేష్‌..

గౌతోజిగూడెం గ్రామం స్వచ్ఛతలో ముందు వరుసలో ఉన్నదని, పారిశుధ్యం పనుల్లో గ్రామస్తుల పని తీరు భేష్‌ అని కలెక్టర్‌ ధర్మారెడ్డి అభినందించారు. ఆదివారం గౌతోజిగూడెం గ్రామసభలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. బీడీ కార్మికులకు పింఛన్‌ ఇవ్వాలని కోరడంతో కలెక్టర్‌ కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కిచెన్‌ షెడ్‌, హరితహారం మొక్కలను పరిశీలించారు.  గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న పంచాయతీ కార్యదర్శి గాయత్రిని, పాఠశాల ఆవరణలో చెట్లను పెంచుతూ, కిచెన్‌ షెడ్‌ను నిర్వహిస్తున్న పర్సబోయిన వెంకటేశ్‌ను శాలువాతో సన్మానించారు. పాఠశాలకు చెందిన విద్యార్థి గణేశ్‌ ప్లాస్టిక్‌ కవర్లను ఏరివేసి, ఎక్కడ చెత్త ఉన్నా పంచాయతీకి సమాచారం ఇస్తున్నాడని తెలుపడంతో గణేశ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీపీవో హనోక్‌, డీఎల్‌పీవో వరలక్ష్మి, ఎంపీపీ పురం నవనీతారవి ముదిరాజ్‌, సర్పంచుల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిట్కుల మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ లతావెంకట్‌గౌడ్‌, ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, డిప్యూటీ పీఆర్‌ నర్సింలు, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, ఏపీవో సౌమ్య, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఇనాయత్‌ అలీ, సర్పంచ్‌ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్‌ రేణుకుమార్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఆనంద్‌, నాయకులు పోగాకు నర్సింలు, బండి నర్సయ్య పాల్గొన్నారు.

ముప్పిరెడ్డిపల్లిలో...

మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లిలో జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ ఆదివారం చెత్తబుట్టలను  పంపిణీ చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసి  చెత్త సేకరణ వాహనాల్లో మాత్రమే వేయాలన్నారు. జిల్లాలో మరో మల్కాపూర్‌గా ముప్పిరెడ్డిపల్లి మారాలని సూచించారు. అనంతరం గ్రామంలో పర్యటించి పనులను పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్కను నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీతారవి ముదిరాజ్‌, సర్పంచ్‌ నరాల ప్రభావతిపెంటయ్య, ఆత్మకమిటీ డైరెక్టర్‌ భిక్షపతి, నాయకుడు శ్రీరామ్‌ పాల్గొన్నారు.


logo