సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Jan 13, 2020 , 03:18:48

నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం

నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం
  • -హౌసింగ్‌బోర్డులో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు
  • - ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్‌ మున్సిపాలిటీ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్‌ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు 4వ వార్డులో హౌసింగ్‌బోర్డు యువకులు, పలువురు కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్‌, రామాయంపేట మున్సిపాలిటీలతోపాటు తూప్రాన్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. హౌసింగ్‌బోర్డు  కాలనీలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా  రాష్ట్ర ప్రభుత్వం పనులు చేసిందని గుర్తు చేశారు. ముఖ్యంగా హౌసింగ్‌ బోర్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అంతేకాకుండా మెదక్‌ పట్టణానికి టీయూఎఫ్‌ఐడీసీ పథకం కింద రూ.30 కోట్లు మంజూరయ్యాయని, వాటిలో నుంచి నిధులను హౌసింగ్‌బోర్డుకు కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యంగా హౌసింగ్‌బోర్డులో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొన్నారు.

అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న శ్రీధర్‌యాదవ్‌తో పాటు వై. నర్మదలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన నరేందర్‌, సుధీర్‌, ధన్‌రాజ్‌, శంశీధర్‌, కృష్ణకాంత్‌, సాయి, కార్తీక్‌, సఫీ, సన్నీ, మహేందర్‌, వినోద్‌, వసీం, మదు, వేణు, దుర్గాప్రసాద్‌, కరుణాకర్‌, నరేందర్‌, సంతోశ్‌, కిట్టు, ప్రశాంత్‌, వెంకటేశ్‌లు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌, బట్టి జగపతి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గంగాధర్‌, గడ్డమీది కృష్ణాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo