శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 12, 2020 , 06:08:30

ముగిసిన.. నామినేషన్ల పరిశీలన

ముగిసిన.. నామినేషన్ల పరిశీలన

మెదక్‌ మున్సిపాలిటీ : మెదక్‌ మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను 316 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం జరిగిన పరిశీలనలో ఒక్క నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురికాలేదని అధికారులు తెలిపారు. ఇదిలావుండగా నర్సాపూర్‌ మున్సిపాలిటీల్లో 15 వార్డులకు గాను 145 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఒక్క నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురికాలేదు. ఇక తూప్రాన్‌ మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 141 నామినేషన్లు దాఖలు కాగా, ఒక్క నామినేషన్‌ తిరస్కరణకు గురైందని అధికారులు తెలిపారు. దీంతో 140 మంది అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు సరిగ్గా ఉన్నట్లు ధ్రువీకరించారు. రామాయంపేట మున్సిపాలాలిటీలో 12 వార్డులకు గాను 126 నామినేషన్లు దాఖలు కాగా, ఒక్క నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. 125 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగ్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో 728 నామినేషన్లు దాఖలు కాగా, అందులో 2 నామినేషన్‌ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 726 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

ఆరంభమైన బుజ్జగింపులు..

ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసిన వారిలో కొందరి నామినేషన్లు ఉపసంహరింపజేసే పనిలో పడ్డారు. దీంతో ముఖ్య నేతలు వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. శనివారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ముగిసింది. దీంతో 14న నామినేషన్ల ఉపసంహరణ ఉండటంతో ఈలోపే ఎవరెవరిని పోటీలో ఉంచి ఎవరెవరిని నామినేషన్లను ఉపసంహరించేలా చేయాలో అన్న విషయంపై నేతలు దృష్టి సారించారు.


logo