బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Jan 12, 2020 , 00:47:46

పల్లెలన్నీ పరిశుభ్రం కావాలి

పల్లెలన్నీ పరిశుభ్రం కావాలి

హవేళిఘనపూర్‌ : ప్రభుత్వం రెండో విడుతలో చేపట్టిన పది రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పూర్తి చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జెడ్పీ సీఈవో లక్ష్మీబాయి అన్నారు. శనివారం మండల పరిధిలోని గంగాపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న పది రోజుల ‘పల్లె ప్రగతి’ పనులను ఆమె పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 11 రోజులుగా చేపట్టిన పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ముఖ్యంగా రోడ్లపై ఉన్న చెత్తాచెదారం తొలగింపు, కలుపు మొక్కల తొలగింపు, మురికి కాలువల పరిశుభ్రత, వీధి దీపాల ఏర్పాటు, గ్రామంలో మిగిలిపోయిన పాత ఇండ్ల కూల్చివేత వంటి పనులను పూర్తి చేయాలని ఆమె పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిరెడ్డి, ఎంపీడీవో సాయిబాబా, ఎంపీవో ప్రవీణ్‌, గ్రామ సర్పంచ్‌ పద్మవెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>