బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Jan 12, 2020 , 00:46:48

తడి, పొడి చెత్తను వేరు చేయాలి

తడి, పొడి చెత్తను వేరు చేయాలి

హవేళిఘనపూర్‌ : చెత్తబుట్టలను వినియోగించుకొని తడి, పొడి చెత్తను వేరే చేసి ఇంటి వద్దకు వచ్చిన చెత్తబండిలోనే వేయాలని డీఎల్‌పీవో జ్యోతిరెడ్డి సూచించారు. మండల పరిధిలోని పోచమ్మరాళ్‌ గ్రామంలో ఆమె చెత్తబుట్టలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎల్‌పీవో మాట్లాడుతూ ప్రభుత్వం పల్లెలను అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. చెత్తబుట్టలను వృథాగా ఉంచకుండా ఇంట్లోని తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్తబండిలో వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిబాబా, డీఎల్‌పీవో ప్రవీణ్‌, గ్రామ సర్పంచ్‌, పంచాయతీ సెక్టరీ నర్సింలు, పేమ్లీ, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. 


logo