గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Jan 12, 2020 , 00:46:05

ఇలాగేనా చెత్తను పారవేయడం ?

ఇలాగేనా చెత్తను పారవేయడం ?


మనోహరాబాద్‌ : చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా చెత్త బుట్టలోనే పారవేయాలని డీఎల్‌పీవో వరలక్ష్మి సూచించారు. మనోహరాబాద్‌ మండలం జీడిపల్లి, కూచారం గ్రామాల్లో శనివారం ఆమె పర్యటించారు. ఇంటింటికీ తిరిగి చెత్తను ఏ విధంగా తడి, పొడి చెత్తగా వేరు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. కూచారంలో ఇంటింటికీ తిరిగిన ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. స్వచ్ఛతలో కూచారం పర్వాలేదని కితాబిచ్చారు. జీడిపల్లిలో చెత్త, ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు అక్కడక్కడా ఉండటంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం, పాలకవర్గం సూచిస్తున్నప్పటికీ ప్రజల్లో మార్పురాకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్తను ఎలా వేరు చేయాలో ఈ  సందర్భంగా ఆమె తెలిపారు. ప్రజల్లో స్వచ్ఛతపై చైతన్యం వచ్చినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని  అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌ ఏఈ విజయప్రకాశ్‌, సర్పంచులు నరేందర్‌రెడ్డి, రేఖ తదితరులు పాల్గొన్నారు. 


logo