సోమవారం 30 మార్చి 2020
Medak - Jan 10, 2020 , 11:53:27

సమన్వయంతో గ్రామాన్ని అభివృద్ధ్ది చేసుకోవాలి

సమన్వయంతో గ్రామాన్ని అభివృద్ధ్ది చేసుకోవాలి

హవేళిఘనపూర్: ప్రజలు సమన్వయంతో ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని హవేళిఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మం డల పరిధిలోని చౌట్లపల్లి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి విద్యార్థుల హాజరు పట్టిక, విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భో జనం గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పద్మారావు పాఠశాల ఆవరణ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అంతేకాకుండా విద్యార్థులకు టాయిలెట్స్ తదితర సమస్యలను ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం మం డల పరిధిలోని స్కూల్ తండా, ఔరంగాబాద్ త ండాలో డంప్‌యార్డ్ నిర్మా ణం కోసం స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా ప్రజలు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశం, గిర్దావర్ నర్సింహరావు, సర్వేయర్ రమేశ్, వీఆర్వో గోపాల్, సర్పంచులు శంకర్, రాంజ్యా, ఫూల్‌సింగ్, ఎంపీటీసీ మంగ్యా, పంచాయతీ సెక్రటరీలు మౌనిక, హారిక, మానస, కీర్తన ఉన్నారు.

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన: మండల ప్రత్యేక అధికారి,బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సుధాకర్
అల్లాదుర్గం: ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు నిర్లక్ష్యంవద్దని మండల ప్రత్యేక అధికారి,బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సుధాకర్ అన్నారు.గురువారం మండల పరిధిలోని బహిరన్‌దిబ్బ,గొల్లకుంట తండాలో పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రభుత్వం సూచించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.గ్రామస్తులందరూ ఐక్యమత్యంతో పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయాలని ఆదేశించారు. నాటిన మొక్కలను రక్షించాలని అన్నారు.మొదటి విడుతలో మిగిలి ఉన్న పనులను రెండో విడుతలో పూర్తి చేయాలని తెలిపారు. మండల కేంద్రమైన అల్లాదుర్గంలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామ సర్పంచ్ పల్లె ప్రగతిలో భాగంగా నూతనంగా బోరు వేయించా రు.బోరులో నీరు పుష్కలంగా పడడంతో గ్రామంలో మంచి నీటి సమస్య తీరనుంది.కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఏపీవో పుణ్యదాస్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

పల్లెలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు : డీఎల్‌పీవో జ్యోతిరెడ్డి
మెదక్ రూరల్: పల్లెలు పరిశుభ్రంగా ఉంచినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని డీఎల్‌పీవో జ్యోతిరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ర్యాలమడుగు,చిట్యాల గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో జరిగే పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రజలు పల్లెప్రగతిలో బాగస్వాములైనప్పుడు పల్లెలు అభివృద్ధ్ది చెందుతాయని అన్నారు.ప్రతి గ్రామానికి డంపుయార్డ్‌లు,వైకుంఠధామాలు నిర్మించుకోవాలని ఆ యా సర్పంచులకు సూచించారు. ఈ కార్యక్రమంలోఎంపీడీవో రాంబాబు, చిట్యాల సర్పంచ్ వెంకటేశం, ర్యాలమడుగు సర్పంచ్ రజని, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా పల్లె ప్రగతి పనులు
టేక్మాల్: పల్లె ప్రగతి పనులు మండలంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పనిచేస్తున్నారు. పర్యావరణ సమతుల్యత కో సం పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల శుభ్రతపై దృష్టి సారిస్తున్నారు. మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తున్నారు. ఇండ్లలో తడి, పొడి చెత్తను వేరు చేయడంలో మహిళలకు అవగాహన కల్పించడంతోపాటు చెత్త రిక్షాలో వేయడం, డంప్ యార్డ్‌కు తరలించడంపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఎంపీడీవో హిరణ్మయి జిల్లా కో ఆప్షన్ సభ్యుడు యూసుఫ్ కుసంగి గ్రామంలో పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. గ్రేసీబాయి ధనూర గ్రామంలో పల్లె ప్రగతి పనులు చేయించారు. టేక్మాల్‌లో సర్పంచ్ సుప్రజా భాస్కర్ పనులను పర్యవేక్షించారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సాయిలు, శ్రీనివాస్, శివకుమార్, కల్పన, నారాయణ, ఆబేదాబేగం, యాదయ్య, సంగయ్య, లచ్చాగౌడ్, అధికారులు విష్ణువర్ధన్, మాణిక్యం, బలరాం, ప్రవీణ్‌కుమార్, బలరాంరెడ్డి, అరుణ్‌కుమార్, బాలకృష్ణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం
పెద్దశంకరంపేట: పల్లెప్రగతిలో భాగంగా గురువారం మండల పరిధిలోని బుజ్రాన్‌పల్లి గ్రామంలో ఇంకుడుగుంతల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు.వ్యక్తిగతంగా ఇంకుడు గుంతల నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన వారికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద మంజూరు చేసి పనులు ప్రారంభం చేశారు. ఈసందర్భంగా బుజ్రాన్‌పల్లితో పాటు బూర్గుపల్లి, దానంపల్లి గ్రామాల్లో వ్యక్తిగత ఇంకుడు గుంతలను పంచాయతీ కార్యదర్శులు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీకార్యదర్శులు సవిత, రూప, గౌసియా బేగం, మల్లేశం, తదితరులున్నారు.

గ్రామాల అభివృద్ధికే పల్లెప్రగతి ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి
చిన్నశంకరంపేట: గ్రామాల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి చేపట్టిందని ఎంపీపీ భాగ్యలక్ష్మి తెలిపారు. గురువారం మండల పరిధిలోని చందాపూర్‌లో ఆమె డంపుయార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యాక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మణమూర్తి, సర్పంచ్ రమాధేవి, ఈజీఎస్ ఏపీవో వెంకటసాయి, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్, గ్రామ స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి పనులు జోరుగా కొనసాగాయి. ఈసందర్భంగా గ్రామాల్లో మురికి కాల్వలు, రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, గ్రామస్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శు లు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.

పాపన్నపేటలో
పాపన్నపేట: మండల పరిధిలోని మిన్పూర్ గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా గురువారం శ్రమదానం నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ వాడలలోని చెత్తాచెదారం తొలగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రిలింగారెడ్డి, ఎంపీటీసీఈ వడ్ల కుభేరుడు, గ్రామ ప్రత్యేక అధికారి ప్రశాంత్, కార్యదర్శి మమత,, గ్రామప్రజలు పాల్గొన్నారు.


logo