e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home జిల్లాలు నిండుకుండలా చెరువులు

నిండుకుండలా చెరువులు

నిండుకుండలా చెరువులు


మునిగిన లోతట్టు ప్రాంతాలు
జలదిగ్బంధంలో చేగుంట బాలుర వసతి గృహం

రామాయంపేట/చేగుంట/ నిజాంపేట/ తూప్రాన్‌ రూరల్‌/ మనోహరాబాద్‌, జూలై 15 : తూప్రాన్‌, చేగుంట, మనోహరాబాద్‌, రామాయంపేట, నార్సి ంగి, నిజాంపేట మండలాల వ్యాప్తంగా బుధవారం అర్ధ్దరాత్రి నుంచి గురువారం తెల్లవారు జాము వ రకు కురిసిన వర్షానికి మండలాల్లో పొలాలన్ని జలమయమయ్యాయి. తూప్రాన్‌ మండలం యావాపూర్‌ చెక్‌డ్యాంలోకి భారీగా వరద నీరు చేరుతున్నది. చేగుంట, నార్సింగి మండలాలలో కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చేగుంటలో బీసీ హాస్టల్‌ మొత్తం జలదిగ్బంధంలోనే ఉంది. వాచ్‌మెన్‌ను పట్టణవాసు లు, చేగుంట ఎస్సై సుభాష్‌ గౌడ్‌ వెళ్లి బయటకు తీసుకొచ్చారు. చేగుంట, ఉల్లితిమ్మాయిపల్లి, రెడ్డిపల్లి, రుక్మాపూర్‌తో పాటు పలు గ్రా మాలోని చెరువుల్లో నీరు చేరుకున్నాయి. రామాయంపేట, నిజాంపేట మండలం లో ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. రామాయంపేట పట్టణంలోని రెడ్డి కాలనీలో నీరు నిలిచిపోవడంతో మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, సిబ్బం ది వెళ్లి జేసీబీ సహాయంతో వర్షపు నీటిని తొలిగించారు తూప్రాన్‌ డివిజన్‌ వ్యాప్తంగా చేగుంటలో అత్యధికంగా వర్ష పాతం నమోదు కాగా అత్యల్పంగా నిజాంపేట మండలంలో నమోదైంది మత్తడి దూకుతున్న హల్దీప్రాజెక్టు,, వెల్దుర్తి, జూలై 15. ఉమ్మడి వెల్దుర్తి మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌డ్యాంలు అలుగు పారుతూ, మత్తడి దూకుతున్నాయి. వెల్దుర్తి, మాసాయిపేట శివారులోని హల్దీ వాగు ప్రాజెక్టుపై నిర్మించిన చెక్‌డ్యాంలు మత్తడి దూకుతుండగా,ఉమ్మడి వెల్దుర్తి మండలంలోని పలు చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి
నర్సాపూర్‌లో..
నర్సాపూర్‌,జూలై15: నర్సాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్‌, కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్‌ మండలాలలో బారీ వర్షం కురిసింది.
కొల్చారం…
కొల్చారం, జూలై 15: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వనదుర్గా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరదనీరు చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండను తలపించేలా ఉంది.
తూముకు మరమ్మతులు
తూప్రాన్‌ రూరల్‌, జూలై 15: మండలంలోని గుండ్రెడ్డిపల్లి పెద్ద చెరువు తూముకు గురువారం మరమ్మతు పనులను చేయించారు. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులోకి నీరు చేరుతున్నది.తూముకు అడ్డం ఉన్న మట్టిని, ముండ్ల పొదలను సర్పంచ్‌ శ్రీలతారాజిరెడ్డి ఆధ్వర్యంలో తొలిగించి శుభ్రం చేయించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిండుకుండలా చెరువులు
నిండుకుండలా చెరువులు
నిండుకుండలా చెరువులు

ట్రెండింగ్‌

Advertisement