e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home మెదక్ మెరుగైన విద్యకు ఉపాధ్యాయలు కృషి చేయాలి

మెరుగైన విద్యకు ఉపాధ్యాయలు కృషి చేయాలి

మెరుగైన విద్యకు ఉపాధ్యాయలు కృషి చేయాలి
  • మెజార్టీ సభ్యత్వాలు కలిగిన సంఘం పీఆర్టీయూ
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సహకారంతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నాం
  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
  • మెదక్‌ జిల్లాలోని పలుచోట్ల పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు

మెదక్‌ మున్సిపాలిటీ/ హవేళీఘనపూర్‌/ రామాయంపేట/ నిజాంపేట/ అల్లాదుర్గం, జూలై 19: మెరుగైన విద్యను అందించడం కోసం ఉపాధ్యాయలు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మెదక్‌ జిల్లా కేంద్రంతో పాటు హవేళీఘనపూర్‌, రామాయంపేట, నిజాంపేట మండల కేంద్రాల్లో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో, హవేళిఘనపూర్‌ జ్యోతిరావుపూలే బాలికల వసతి గృహంలో, నిజాంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, అల్లాదుర్గం మండల పరిధిలోని చిల్వెర ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి ఉపాధ్యాయులకు సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 80వేల సభ్యత్వాలు కలిగిన ఏకైక సంఘం పీఆర్‌టీయూటీఎస్‌ అని పేర్కొన్నారు. మెజార్టీ సభ్యత్వాలు కలిగిన ఈ సంఘం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి 30శాతం పీఆర్సీ, ఉద్యోగుల వయస్స 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచారన్నారు. పీఆర్టీయూ సంఘం కేవలం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏర్పడిన ఏకైక ఉపాధ్యాయ సంఘమన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు పీఆర్టీయూ సంఘంలో ప్రాథమిక సభ్యత్వం తీసుకుని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందించాలన్నారు. కాగా, హవేళీఘనపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్ష కార్యదర్శులు మేడి సతీష్‌రావు, ఆర్‌.సుభాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ, మెదక్‌ మండల పీఆర్టీయూ అధ్యక్షుడు శిరిగే చంద్రశేఖర్‌, నాయకులు శ్రీనివాస్‌, మల్లారెడ్డి, రవికుమార్‌, మహేశ్‌, సతీష్‌, సుభాష్‌రెడ్డి, సాయిలు, యాదవరెడ్డి, కవిత, వెంకటేశ్‌, బాల అనపోతారెడ్డి, సంతోశ్‌కుమార్‌, అల్లాదుర్గం మండల విద్యాధికారి పోచయ్య, పీఆర్టీయూ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

టీచర్‌ రాజేందర్‌కు ఘన సన్మానం
రామాయంపేట మున్సిపల్‌ పరిదిలోని కోమటిపల్లి ఆదర్శపాఠశాలను ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల డాక్టరేట్‌ పొందిన రాజేందర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం మోడల్‌ స్కూల్‌ సమస్యలపై ప్రిన్సిపాల్‌ అమ్‌తుల్‌ జమాల్‌ ఆస్ర్తాను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నిజాంపేట మండల అధ్యక్ష, కార్యదర్శిలు భానుప్రసాద్‌, విద్యాసాగర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు, పీఆర్టీయూ నాయకులు ఉన్నారు.

- Advertisement -

సీఆర్‌పీ కుటుంబానికి ఆర్థిక సాయం..
అల్లాదుర్గం మండల వనరుల కేంద్రంలో విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడి మృతి చెందిన సీఆర్‌పీ దేవకీదేవి కుటుంబానికి మండల పీఆర్టీయూ తరఫున రూ.75వేలను ఆర్థిక సాయం ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అందజేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెరుగైన విద్యకు ఉపాధ్యాయలు కృషి చేయాలి
మెరుగైన విద్యకు ఉపాధ్యాయలు కృషి చేయాలి
మెరుగైన విద్యకు ఉపాధ్యాయలు కృషి చేయాలి

ట్రెండింగ్‌

Advertisement