e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home జిల్లాలు పటాన్‌చెరుకు సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన

పటాన్‌చెరుకు సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన

ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం
సంబురాలు చేసుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు
పటాన్‌చెరులో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
ఫలించిన ఎమ్మెల్యే జీఎంఆర్‌ కృషి

పటాన్‌చెరు, ఆగస్టు 1 : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల కల సాకారమైంది. బోనాల పండుగ పర్వదినాన సీఎం కేసీఆర్‌ నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు అందించారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్‌చెరు పట్టణంలో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్‌ సమావేశంలో పటాన్‌చెరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దవాఖాన ఏర్పాటుకు పట్టువదలని విక్రమార్కుడిగా ఎనిమిది నెలలుగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చేసిన కృషి ఫలించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గంలో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్న తెలిపారు. కార్మికులు, నిరుపేదలు, మద్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పటాన్‌చెరు నియోజకవర్గంలో, 250 కోట్ల రూపాయలతో 270 పడకల దవాఖాన ఏర్పాటు చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటారని తెలిపారు. దవాఖాన ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, జిల్లా మంత్రి తన్నీరు హరీశ్‌రావు, శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, వైద్య విభాగం అధికారులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దవాఖాన ఏర్పాటుపై నిరంతరం తమ కథనాలతో ప్రజలకు సమాచారం అందించిన మీడియాకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం…
పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుపై కేబినేట్‌ ఆమోదం తెలపడంతో ఆదివారం రాత్రి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తు సంబురాలు పటాన్‌చెరులో సంబురాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భం గా సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీ క్షీరాభిషేకం చేశారు. పార్టీ సీనియర్‌ నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుని స్వీట్లు తినిపించుకున్నారు. పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా నాయకులు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana