e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home మెదక్ సమస్యలపై సకాలంలో స్పందించాలి

సమస్యలపై సకాలంలో స్పందించాలి

సమస్యలపై సకాలంలో స్పందించాలి

మెదక్‌ మున్సిపాలిటీ, జూలై 14: విద్యుత్‌ సమస్యలపై ట్రాన్స్‌కో అధికారులకు సమాచారమిచ్చిన స్పందించక పోవడంతో రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ట్రాన్స్‌కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జడ్పీ కార్యాలయంలో 7వ స్థాయి సంఘ సమావేశం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హేమలతా గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్‌ భగీరథ, రోడ్లు భవనాల శాఖ, పీఆర్‌, నీటి పారుదల, ట్రాన్స్‌కో అధికారులు వారి నివేదికలు చదివి వినిపించారు. నివేదికలను సమీక్షించిన ఎమ్మెల్యే విద్యుత్‌ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మెదక్‌ నియోజకవర్గంలోని డబుల్‌ బెడ్‌రూంల వద్ద విద్యుత్‌ సరఫరాకు కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్ల పనులను , నీటిపారుదల శాఖ పనుల వివరాలను ఆశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థాయి సంఘ సమావేశాలకు హాజరు కా ని అధికారులపై మండిపడ్డారు. సమావేశాలకు అధికారులు ప్రగతి నివేదికలతో రాకపోవడం సరైంది కాదన్నారు.

డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలను పూర్తి చేయాలి
జిల్లాలో డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలను త్వరితగతిన పూర్తి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాగౌడ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో 1,2వ స్థాయీ సంఘం సమావేశాలు జడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భగా గ్రామీణాభివృద్ధి విద్య-వైద్యం, ఆర్థిక ప్రణాళిక నివేదికలను సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిధులు ఉన్నా డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు ఎందు కు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులను ప్రశ్నించగా.. జిల్లాలో మూడు వైకుంఠధామాలు, ఒక డంపింగ్‌యార్డు స్థలం విషయం లో పెండింగ్‌లో ఉన్నాయన్ని డీపీవో తరుణ్‌ తెలిపారు. ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన మనోహరాబాద్‌లో బస్సు లు నిలుపడం లేదని జడ్పీ చైర్‌పర్సన్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు. డిపో మేనేజర్‌ రాకుండా సూపరింటెండెంట్‌ను పంపడంపై మండిపడ్డారు. స్థాయి సంఘ సమావేశాలకు సబార్డినేటర్ల పంపవద్దని ఆమె సూచించారు.

- Advertisement -

ఉపాధి పనులను కల్పించడంలో రాష్ట్రంలో జిల్లా 4వ స్థానం
ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు పనులను కల్పించడంలో రాష్ట్రంలో జిల్లా 4వ స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామీణాభివృద్ధ్ది అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలో 469 సెగ్రిగేషన్‌ షెడ్స్‌ నిర్మాణం పూర్తి చేసుకొని దేశంలోనే మొదటి జిల్లాగా మెదక్‌ నిలిచిందన్నారు. స్త్రీ నిధి రుణాలు 2020-21 సంవత్సరానికి స్త్రీ నిధి బ్యాంకు ద్వారా 4,886 సంఘాలలో 17,766 సభ్యులకు రూ. 78 కోట్ల రుణా లు అందజేసి వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు వివరించారు. పరిశ్రమల కేంద్రం అధికారి మాట్లాడుతూ జిలాల్లో టీఎస్‌ ఐపాస్‌తో ఇప్పటి వరకు 495 పరిశ్రమలు రూ.5564 కోట్ల పెట్టుబడితో 16,629 మందికి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకు న్నట్లు తెలిపారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 495 యూనిట్లకు సంబంధించి 1,416 అనుమతులుకు దరఖాస్తు చేసుకోగా 1,185 మందికి అనుమతులు ఇచ్చామన్నారు. సమావేశానికి హాజరుకాని జిల్లా కోఆపరేటీవ్‌ అధికారి , గృహనిర్మాణ అధికారులతో పాటు మెదక్‌ బస్‌డిపో మేనేజర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు మాధవి, రాణి, సుజాత, సౌందర్య, విజయరామరాజు, విజయ్‌కుమార్‌, యాదిగిరి, కృష్ణారెడ్డి, జడ్పీ సీఈవో శైలేష్‌ , జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, ఉపాధికల్పన అధికారి విజయ్‌కుమార్‌, మైనింగ్‌ అధికారి జయరాజ్‌, యువజన సంక్షేమాధికారి నాగరాజు, ట్రాన్స్‌కో ఈఈ మల్లేశం పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమస్యలపై సకాలంలో స్పందించాలి
సమస్యలపై సకాలంలో స్పందించాలి
సమస్యలపై సకాలంలో స్పందించాలి

ట్రెండింగ్‌

Advertisement