మెదక్ అర్బన్, ఫిబ్రవరి 24 : మార్చి 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్ కక్షిదారులకు సూచించారు. గురువారం మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకునేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాజీ కుదుర్చుకోవడంతో ఇరువురికి న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి రీటాలాల్ చంద్, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రారెడ్డి, సీనియర్ న్యాయవాదులు జనార్దన్‌రెడ్డి, రాములు, శ్రీనివాస్, కార్యదర్శి సంతోష్‌రెడ్డి, మెదక్ డీఎస్పీ సైదులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి..
నర్సాపూర్, ఫిబ్రవరి 24 : లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీసెస్ నర్సాపూర్ కమిటీ చైర్మన్ కె.అనిత సూచించారు. గురువారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షణికావేశంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకొని తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. లోక్‌అదాలత్‌లో ఇరువర్గాల వారు రాజీ కుదుర్చుకొని కలిసిమెలిసి ఉండాలని సూచించారు. అనంతరం జిన్నారం మండలం మందారం గ్రామానికి చెందిన టాకూర్ రామాబాయి, టాకూర్ అన్నపూర్ణబాయి ఇరువర్గాలకు సంబంధించిన కేసును న్యాయమూర్తి సమక్షంలో పరిష్కరించారు. సమావేశంలో న్యాయవాదులు జాఫర్ అలీ, అంజిరెడ్డి, ప్రకాశ్, శ్రీనివాస్, స్వరూపారాణి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.