e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home మెదక్ రామాయంపేట అభివృద్ధికి నిధులు మంజూరు

రామాయంపేట అభివృద్ధికి నిధులు మంజూరు

రామాయంపేట అభివృద్ధికి నిధులు మంజూరు
  • ప్రణాళికాబద్ధంగా యాదాద్రి పార్కు పనులు
  • 5 ఎకరాల్లో 6 వేల ఆక్సిజన్‌, పూలు, పండ్ల మొక్కలు
  • నర్సరీలో 50వేల మొక్కల పెంపకం
  • నాటడానికి సిద్ధంగా 35 వేల మొక్కలు
  • మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

రామాయంపేట, మే 20 : రామాయంపేట అభివృద్ధ్దికి రూ.4కోట్లు కేటాయించామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రామాయంపేటకు విచ్చేసిన ఎమ్మెల్యే మున్సిపల్‌ కార్యాలయంలో యాదాద్రి పార్కు పనుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం విలేకరులతో మాట్లాడారు. రామాయంపేటలోని సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లకు రూ.2 కోట్లు, పట్టణంలోని సిద్దిపేట రహదారి సైడ్‌ డ్రేనేజీలలకు రూ.కోటి, వైకుంఠధామ నిర్మాణాలకు రూ.కోటి మొత్తం రూ.4కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని చైర్మన్లకు సూచించారు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్‌ పలు చేయాలన్నారు. యాదాద్రి పా ర్కు పలు ప్లాన్‌ ప్రకారం నిర్మించాలన్నారు. పార్కులో 6వేల పండ్ల, పూ ల మొక్కలతో పాటు ఆక్సిజన్‌ ఇచ్చే మొక్కలనే నాటాలన్నారు. నర్సరీ లో 50వేల మొక్కలకు గాను 35వేల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. రాబోయే జూన్‌, జూలై లో పార్కులతో పాటు వివిధ కాలనీల్లో మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరాఫ్‌ యాదగిరి, కమిషనర్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు దేమె యాదగిరి, చిలుక గంగాధర్‌, సిబ్బంది కాలేరు ప్రసాద్‌, నవాత్‌ ప్రసాద్‌, శంకర్‌, పద్మ తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రామాయంపేట అభివృద్ధికి నిధులు మంజూరు
రామాయంపేట అభివృద్ధికి నిధులు మంజూరు
రామాయంపేట అభివృద్ధికి నిధులు మంజూరు

ట్రెండింగ్‌

Advertisement