e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home మెదక్ ‘ముక్కోటి వృక్షార్చన’ విజయవంతం చేయాలి

‘ముక్కోటి వృక్షార్చన’ విజయవంతం చేయాలి

నర్సాపూర్‌,జూలై23: నేడు మున్సిపల్‌, ఐటీ శాఖామాత్యులు కేటీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నర్సాపూర్‌ లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని శనివారం క్యాంప్‌ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి, ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లను పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఎల్లాపూర్‌ అటవీ ప్రాంతంలో సిబ్బంది ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నామన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత
నర్సాపూర్‌ 1వార్డుకు చెందిన బాధితురాలికి కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రూ.2 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేశారు. జగన్నాథరావు కాలనీకి చెందిన రేణుక కుమారుడు ప్రమాదవశాత్తూ మరణించడంతో సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దానికి సంబంధించిన చెక్కు రావడంతో శుక్రవారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బాధితురాలికి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయీమొద్దీన్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ హబీబ్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, కౌన్సిలర్లు అశోక్‌గౌడ్‌, రాంచందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నగేశ్‌, సత్యంగౌడ్‌, దావూద్‌ పాల్గొన్నారు.

- Advertisement -

చిలిపిచెడ్‌లో…
చిలిపిచెడ్‌, జూలై 23: ప్రతి గ్రామ పంచాయతీలో సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని మండల ప్రత్యేక అధికారి దేవయ్య అన్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో ఉపాధి కూలీలతో గుంతలు తీసి మొక్కలు నాటాలన్నారు. ప్రతి గ్రామానికి పది వేల మొ క్కలను సిద్ధం చేసి రహదారికి ఇరువైపులా మొక్కలను నాటాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మమ తబాబు, ఎంపీవో పోలేశ్వర్‌రాజు, ఏపీవో శ్యాంకుమార్‌, కార్యదర్శులు పాల్గొ న్నారు.

గొల్పర్తిలో….
రామాయంపేట, జూలై 23: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తిలో రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ వంద మొక్కలు నాటారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటి ఎదుట మొక్కలను నాటాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మల్యాల కిషన్‌, మెట్టు శేఖర్‌, అనిల్‌ కుమార్‌, కృష్ణ ఉన్నారు.

మొక్కలను పరిశీలించిన ఎంపీడీవో
హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డులను ఏర్పాటు చేసి సంరక్షించాల్సిన బా ధ్యత ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, గ్రామస్తులదేనని ఎంపీడీవో అరుంధతి అన్నారు. మండలంలోని యా వాపూర్‌, ఇమాంపూర్‌లో ఈజీఎస్‌ ఏపీవో సంతోశ్‌రెడ్డితో కలిసి ఆమె పర్యటించి హరితహారం మొక్కల చుట్టూ అమర్చిన ట్రీగార్డులను పరిశీలించారు. ఆమె వెంట సర్పంచ్‌లు నర్సింహ్మరెడ్డి, గుర్రం ఎల్లం, కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు,

2వ వార్డులో మొక్కల అందజేత
ఇండ్ల పరిసరాల్లో 6 మొక్కలకు తక్కువ కాకుండా పండ్లు, పూల మొక్కలను నాటి సంరక్షించాలని 2వ వార్డు కౌన్సిలర్‌ మామిడి వెంకటేశ్‌ మహిళలకు సూచించారు. పట్టణంలోని 2వ వార్డులో ప్రజలకు పండ్లు, పూల మొక్కలను ఆయన అందజేశారు. ఆయన వెంట మహిళలు, యువతీ, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.

నేడు మెగా ప్లాంటేషన్‌
మనోహరాబాద్‌ మండలం గౌతోజీగూడెంలో నేడు మెగా ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణు కుమార్‌ తెలిపారు. శనివారం ఉదయం గౌతోజీ గూడెంలో వెయ్యి మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతా శేఖర్‌గౌడ్‌ హాజరుకానున్నారన్నారు.

శివ్వంపేటలో…
కలెక్టర్‌ ఆదేశానుసారం శివ్వంపేట మండలంలో శనివారం ఉదయం మెగా ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నవీన్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలను నాటే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.

నిజాంపేటలో…
నేడు రాష్ట్ర మున్సిపాల్‌,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ‘ముక్కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ఒక ప్రకటన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు రోడ్లకు ఇరువైపులా,ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని ఆయన సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana