e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home మెదక్ బోదకాలపై యుద్ధం

బోదకాలపై యుద్ధం

బోదకాలపై యుద్ధం
 • వ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం
 • జాతీయ ఫైలేరియా నివారణ కార్యక్రమం
 • నేటినుంచి అల్పెండజోల్‌ మాత్రల పంపిణీ
 • సిద్దిపేట జిల్లాలో 9,45,426 మందికి మాత్రలు
 • జిల్లాలో 2612 మంది వ్యాధిగ్రస్తులకు పింఛన్‌

దుబ్బాక, జూలై 14 : బోదవ్యాధి(ఫైలేరియా) ఆడ క్యూలెక్స్‌ దోమ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. బోధ వ్యాధి మరణానికి దారి తీయకపోయినా.. దుష్పరిణామాలు చాలా తీవ్రమైనవి. వ్యాధి సంక్రమణను ప్రాథమిక దశలో గుర్తించడం కష్టసాధ్యం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే నివా రణ చాలా సులభం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ముంద స్తు చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంతో క్రమక్రమంగా బోధ వ్యాధిగ్రస్తులు తగ్గిపోతున్నారు. వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా రూ.2016 పింఛన్‌ అందజేస్తూ తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 2612 మంది పింఛన్‌ అందుకుంటున్నారు.

లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌ (ఎల్‌ఎఫ్‌)…
ఎల్‌ఎఫ్‌ పరాన్నజీవి (దారం వంటి పురుగు)తో వచ్చే వ్యాధి. మానవ శరీరంలోని శోష రస వ్యవస్థలో చేరిన ఫైలేరియా సూక్ష్మ దశలోని మైక్రోఫైలేరియా(ఎంఎఫ్‌)లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి శరీర ఉపరితల రక్షణ వ్యవస్థ(చర్మం)లోనికి చేరుతాయి. సదరు వ్యక్తుల రక్తాన్ని స్వీకరించిన దోమల్లోకి మైక్రో ఫైలేరియా చేరుతుం ది. సంక్రమిత మైక్రో ఫైలేరియా 12 రోజుల్లో పెరిగి, లార్వాదశకు చేరి, దోమకాటుతో మరొకరికి వ్యాప్తి చెందుతుంది. తొలిదశలో సాధారణ లక్షణాలు కనిపించవు. కానీ, లింఫ్‌ వ్యవస్థ దెబ్బ తిం టుంది. ఎల్‌ఎఫ్‌ ఉన్న వ్యక్తులను గుర్తించలేము. కానీ, వీరి ద్వారా పరాన్న జీవి వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. పరాన్న జీవి సంక్రమణతో శోషరస (లింఫ్‌) నాళాల్లో ఉత్పత్తిని అస్థిరపరుస్తుంది. దీన్నే ఎడినో లింఫానిజైటిస్‌ అంటారు. సంక్రమిత శరీర భాగాల్లో మంట, ఎర్రబారడం లక్షణాలతోపాటు తరుచూ జ్వరం వస్తుంది.
1, వ్యాధి లక్షణాలు…

 • తరుచూ వచ్చే కొద్దిపాటి జ్వరం, ఆయాసం…
 • శోషనాళాలు పాడైపోయి, లింఫ్‌ ప్రసరణ ఆగిపోవడంతో
  కాళ్లు, చేతుల్లో వాపు రావడం ..
 • వరిబీజం (బుడ్డ), లైంగిక అవయవాలు దెబ్బతినడం.
 • చర్మంపై పుండ్లు, పుండ్ల నుంచి నీరు కారడం, దురద.
 • గజ్జల్లో , చంకల్లో బిళ్లలు కట్టడం..
 • శరీరంలోని వివిధ భాగాలకు వస్తుంది.
 • లైంగిక అవయవాలకు సైతం సోకుతుంది.
 • జాతీయస్థాయలో ఫైలేరియా నివారణ కార్యక్రమం..
  ఫైలేరియా(బోధకాలు) వ్యాధి నివారణపై 2004 నుంచి జాతీ యస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ అన్ని శాఖల సహకారంతో ప్రజలకు ఫైలేరియా నివారణ మాత్రల పంపిణీ చేపట్టారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయుల సహకారంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జిల్లావ్యాప్తంగా మాత్రలను పంపిణీ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 10,50,525 జనాభా. వీరిలో 9,45, 426 మందికి మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు 35 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 3 అర్బన్‌ సెంటర్ల కేంద్రాల సిబ్బందితో ప్రభుత్వం మూడు రోజులపాటు మాస్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎండీఏ) చేపట్టినుంది. మొత్తం 3786 మంది (ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, టీచర్లు, మెప్మా, ఐకేపీ వలంటీర్లు) 1893 బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికీ వెళ్లి వ్యక్తి వయస్సు ఆధారంగా అల్బెండజోల్‌, డీఈసీ మాత్రలు ఇస్తారు.
  ఫైలేరియా నివారణ మందుల పంపిణీ (ఎండీఏ)
  ఫైలేరియా నివారణకు డీఈసీ, అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ చేపట్టారు. డీఈసీ మాత్ర సూక్ష్మ ఫైలేరియాను నశింపజేస్తుంది. అల్బెండజోల్‌ మాత్ర పేగుల్లో ఉండే క్రిముల్ని నిర్మూలిస్తుంది. రెండింటిని కలిపి ఇస్తే వ్యక్తిలోని పరాన్నజీవులను చంపుతాయి.
  సిద్దిపేట జిల్లాలో 8023 ఫైలేరియా కేసులు..
  జిల్లాలో ఫైలేరియా సోకినవారు 8023 మంది. ఇందులో గ్రేడ్‌-1లో 2276, గ్రేడ్‌-2లో 2984, గ్రేడ్‌-3లో 2763 మంది ఉన్నారు. వీరిలో 2612 మందికి నెలకు రూ.2016 పింఛన్‌ అం దజేస్తున్నారు. మరో 60 మందికి త్వరలోనే పింఛన్‌ ఇస్తారు.
- Advertisement -

ఇంటికి వచ్చి మాత్రలు ఇస్తాం..
సిద్దిపేట జిల్లాలో అల్బెండజోల్‌, డీఈసీ మాత్రలను ఇంటికి వెళ్లి పం పి ణీ చేస్తాం. జిల్లాలో 9,50,000 మం దికి మాత్రలు అందజేస్తాం. జిల్లాలో 35 పీహెచ్‌పీ కేంద్రాలు, 3 అర్బన్‌ సెంటర్ల ద్వారా మొత్తం 3786 మంది సిబ్బందితో పాటు 1893 బృందాలను ఏర్పాటు చేశాం. మరో 35 రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు సిద్ధం ఉన్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వశాఖలతోపాటు ప్రజాప్రతినిధుల సహకారంతో మాత్రల(డీఎంఏ) పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చే శాం. ఇప్పటికే జిల్లా, మండల స్థాయి కమిటీలతో సమావేశా లు నిర్వహించాం. భోజనం లేదా అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రలు తీసుకోవాలి. బోద వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. కరోనా వైరస్‌ చికిత్స పొందుతున్న వారికి, రెండేండ్లలోపు పిల్లలకు మాత్రలు వేయడం లేదు.
– మనోహర్‌, సిద్దిపేట జిల్లా వైద్యాధికారి

మెదక్‌ జిల్లాలో 7,54,400 మందికి..

 • డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు
  మెదక్‌, జూలై 14 : జిల్లాలో వ్యాధి నివారణకు 7,54,400 మందికి మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు మాత్రల పంపిణీ చేయనున్నారు. ప్రతి ఇంటిని సందర్శించి, మాత్రలు అందజేస్తారు. ఇందుకోసం 3451మంది పని చేస్తారు. జిల్లా లోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అల్బెండజోల్‌, డీఈసీ మాత్రలు, ప్రచార సామగ్రి, వివరాలు నమోదు పత్రాలను తర లించారు. 250 మంది జనాభాకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో డాక్టర్‌ నవీన్‌కుమార్‌, ఏఎంవో కుమారస్వామి, డెమో పాండురంగాచారి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బోదకాలపై యుద్ధం
బోదకాలపై యుద్ధం
బోదకాలపై యుద్ధం

ట్రెండింగ్‌

Advertisement