e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home మెదక్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తా

ప్రజల సమస్యలు పరిష్కరిస్తా

ప్రజల సమస్యలు పరిష్కరిస్తా
  • ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
  • ‘మీ కోసం నేనున్నా ’కార్యక్రమానికి చక్కటి స్పందన
  • సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల అందజేత

మెదక్‌, జూలై 16 : ప్రజల సమస్యలు విని.. వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తూ నియోజవకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నారు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి. ప్రతి నెలా 2, 16వ తేదీల్లో మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో 168 మంది త మ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, 26 మంది ఫోన్‌ ద్వారా సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్‌ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పా రు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సీఎంఆర్‌ఎఫ్‌తో పాటు కల్యాణలక్ష్మి షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశామన్నారు. మెదక్‌ పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌,కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
మెదక్‌ నియోజకవర్గంలోని మెదక్‌ పట్టణం, మెదక్‌ మండలం, హవేళిఘనపూర్‌, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాలకు చెందిన వారికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద 71 మంది లబ్ధిదారులకు రూ.28,78,500 చెక్కులను అందజేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథ కం కింద హవేళిఘనపూర్‌ మండలానికి చెందిన 7 మంది లబ్ధిదారులకు రూ.7,00,812 విలువగల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ లావణ్యరెడ్డి, ఆర్డీవో సాయిరాం, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, కమిషనర్‌ శ్రీహరి, రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, జయరాజ్‌, శ్రీనివాస్‌, వంసత్‌రాజ్‌, లక్ష్మీనారాయగౌడ్‌, మెదక్‌ పట్టణ, మెదక్‌, హవేళిఘనపూర్‌, నిజాంపేట మండలాల అధ్యక్షులు గంగాధర్‌, అంజాగౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, నియోజకవర్గంలోని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు జయరాంరెడ్డి, లింగారెడ్డి, కిష్టయ్య, రాగి అశోక్‌, సుమన్‌, మోచి కిషన్‌, బాలాగౌడ్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణ, ఉమర్‌, షాకీర్‌, నవీన్‌, సాప సాయిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

విద్యుత్‌ సమస్యలపై సత్వరం స్పందించాలి…
విద్యుత్‌ సమస్యలపై సత్వరం స్పందించి చర్యలు తీసుకోవాలని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాపన్నపేట, చిన్నశంకరంపేట, మెద క్‌ పట్టణం, మెదక్‌ మండలం, హవేళిఘనపూర్‌, నిజా ంపేట, రామాయంపేట మండలాలకు చెందిన విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్‌ నియోజకవర్గంలోని విద్యుత్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ ప్రమాదాలు జరుగకుం డా ప్రజలను, రైతులను అప్రమత్తం చేసి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. విద్యుత్‌ స్తంభాల వద్ద తీగలు సక్రమంగా లేకపోవడం వల్ల రైతులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పల్లెలు, పట్టణాల్లో విద్యుత్‌ స్తంభాలు ప్రమాదకరంగా మారాయని, వెంటనే తొలిగించి స్తంభాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

మెదక్‌ పట్టణంలోని 32 వార్డుల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌కు సూచించారు. 25వ వార్డులో రెండు విద్యుత్‌ స్తంభాలు మార్చకపోవడంతో సీసీ రోడ్డు పనులు నిలిచిపోయాయని కౌన్సిలర్‌ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే తొలిగించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పట్టణంలోని 33కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు స్థలం సేకరణ పనులు ప్రారంభించాలని తెలిపారు. రామాయంపేట పట్టణంలోని 4వ వార్డు లో త్రీఫేజ్‌ విద్యుత్‌ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కుర్తివాడ, రాజ్‌పల్లి, మడూ రు, జంగరాయి, మిర్జాపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు ఎంత వరకు వచ్చాయని ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు నెల ల్లో విద్యుత్‌ పనులపై రీవ్యూ నిర్వహిస్తానని ఆ లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ జానకీరాం, రెడ్డి, ట్రాన్స్‌కో డీఈ వెం కటేశ్వర్లు, ఏడీఈ సత్యనారాయ ణ, మెదక్‌ నియోజకవర్గంలోని విద్యుత్‌ ఏఈలు, కమిషనర్‌ శ్రీహరి పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కు అందజేత
ఆడపిల్లల తల్లిదండ్రులను ఆదుకోవడానికే సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం చిన్నశంకరంపేటలో ఆమె మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 69మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధిదారులకు రూ.3లక్షల 54వేలు సీఎం రిలీఫ్‌ఫం డ్‌ చెక్కులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవి, రైతు బంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పట్లో రి రాజు, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, సర్పంచ్‌ రాజిరెడ్డి, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రజల సమస్యలు పరిష్కరిస్తా
ప్రజల సమస్యలు పరిష్కరిస్తా
ప్రజల సమస్యలు పరిష్కరిస్తా

ట్రెండింగ్‌

Advertisement