e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home మెదక్ నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మనోహరాబాద్‌, జూలై 18 ః నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌ మండలానికి చెందిన నలుగురు సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేయగా వారికి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నిరుపేదలకు ఆసరాగా సీఎంఆర్‌ఎఫ్‌ నిలుస్తుందన్నారు. ప్రైవేటు దవాఖానలకు దీటుగా నేడు ప్రభుత్వ దవాఖానలు తయారయ్యాయన్నారు. చాలా మంది ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి డబ్బులు వృథా చేసుకుంటున్నారని, ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న వైద్యసేవలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం కాళ్లకల్‌కు చెందిన సాయికుమార్‌కు రూ. 60 వేలు, మనోహరాబాద్‌కు చెందిన దశరథ్‌కు రూ. 12 వేలు, కూచారానికి చెందిన ప్రభాకర్‌కు రూ. 32 వేలు, నగరానికి చెందిన కవితకు రూ. 60 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, నాయకుడు మన్నె నాగరాజు, లబ్ధిదారులు పా ల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత
నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌ నిలుస్తుందని జడ్పీటీసీ పబ్బా మహేశ్‌గుప్తా అన్నారు. శివ్వంపేట మండలానికి చెం దిన ఇద్దరికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కృషి తో వచ్చిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బడుగు, బ ల హీనవర్గాల అభ్యున్నతికి సీ ఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. శివ్వంపేటకు చెందిన ఆర్‌. నగేశ్‌ కు రూ. 32 వేలు, అల్లిపూర్‌కు చెందిన ధనలక్ష్మికి రూ.42 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌గుప్తా, ఉపసర్పంచ్‌ పద్మావెంకటేశ్‌ , పాల్గొన్నారు

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana