e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home మెదక్ జహీరాబాద్‌లో గన్‌ కల్చర్‌..!

జహీరాబాద్‌లో గన్‌ కల్చర్‌..!

జహీరాబాద్‌లో గన్‌ కల్చర్‌..!
  • బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాలు
  • రియల్‌ వ్యాపారులు, సంపన్నులే లక్ష్యం
  • ఏటీఎంల వద్ద, ఆభరణాలు ధరించి వెళ్తున్న వారిని బెదిరించి లాక్కుంటున్న దుండగులు
  • రెచ్చిపోతున్న కర్ణాటక, మహారాష్ట్ర ముఠాలు
  • తాజాగా పోలీసుల అదుపులో కర్ణాటక వ్యక్తి

జహీరాబాద్‌, జూలై 11 : కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున ఉన్న జహీరాబాద్‌ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులకు కత్తిమీద సాములా మారింది. అంతర్రాష్ర్ట ప్రాంతం కావడంతో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో గన్‌కల్చర్‌ బాగా పెరిగిపోయిం ది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేసుకునేవారు, బంగారు ఆభరణాలు ధరించి బైక్‌లపై వెళ్తున్నవారిని కొందరు తుపాకులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలో ఆదివారం పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో ఆ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు తుపాకులు, కత్తులతో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భూముల ధర లు భారీగా పెరిగి రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతున్నది. రౌడీలు, పాత నేరస్తులు ముఠాగా ఏర్పడి నాటు తుపాకులు కొనుగోలు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నే రాల నియంత్రణకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాలతో డీఎస్పీ శంకర్‌రాజు, జహీరాబాద్‌ పట్టణ సీఐ రాజుశేఖర్‌, ఎస్సై శ్రీకాంత్‌ రాత్రీపగలు ప్రత్యేక నిఘా ఏర్పా టు చేసి నేరస్తులను అదుపులోకి తీసుకుంటున్నారు.

సికింద్రాబాద్‌లో కొనుగోలు…
కర్ణాటకలోని కుంచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మ ఖ్ధాంపూర్‌ గ్రామానికి చెందిన జుబేర్‌(22) హైదరాబాద్‌ లో ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.3 వేలకు నాటుతుపాకీ కొనుగోలు చేసినట్లు తెలిసింది. తర్వాత ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడుతున్న ట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. జుబేర్‌ అరెస్టు చేసిన పోలీసులు.. ముఠాలో ఎంత మంది సభ్యులు ఉన్నారు? ఎక్కడెక్కడ బెదిరింపులకు పాల్పడ్డారు? తదితర అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. కర్ణాటకకు చెందినవారు బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు సంఘటనలను బట్టి తెలుస్తున్నది. ఇక్కడ నేరాలు చేసి కర్ణాటకకు పారిపోవడంతో వారిని అదుపులోకి తీసుకోవడం జహీరాబాద్‌ పోలీసులకు కష్టంగా మారుతున్నది.

- Advertisement -

తుపాకులతో బెదిరించి..
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భూ సమస్యల పరిష్కారా నికి రౌడీలను ఆశ్రయించి, ఎదుటివారిని బెదిరిస్తున్న సం ఘటనలు జహీరాబాద్‌ ప్రాంతంలో కలకలం రేపుతున్నా యి. ఆరునెలల క్రితం జహీరాబాద్‌ మండలం గోవింద్‌ పూర్‌ శివారులో ఓ భూ వివాదంలో రియల్‌వ్యాపారి రౌడీ ముఠాను ఆశ్రయించగా, మరో వ్యాపారిపై రౌడీలు కాల్పులు జరిపిన ఘటన అప్పట్లో స్థానికంగా కలకలం సృష్టించింది. జహీరాబాద్‌ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఘర్షణలు చోటుచేసుకుంటున్నా యి. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు హైదరాబాద్‌, కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన రౌడీ ముఠాలను ఆశ్రయిస్తుండగా.. కొందరు యువకులను వెంట వేసుకొని, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాటుతుపాకులు, కత్తులతో బెదిరింపులు పెరిగిపోవడం తో ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తున్నది. రియల్‌ వ్యాపారులు పేదల భూములు కొనుగోలు చేయడం, పక్కన ఉన్న భూములు అమ్మకపోతే వారిని తుపాకులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఇటీవల కాలంలో పెరిగాయి.

కఠిన చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వ లైసెన్స్‌ లేకుండా తుపాకు లు ఉపయోగించే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. గతంలో జహీరాబాద్‌ మండలం గోవింద్‌పూర్‌ శివారులో భూవివాదంలో కాల్పులు జరిపినవారిపై కేసు నమోదు చేశాం. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని చించోళి తాలూకకు చెందిన జుబేర్‌ అక్రమంగా తుపాకీతో తిరగడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. జహీరాబాద్‌ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్రకు సరిహద్దులో ఉండడంతో అక్కడి వారు ఇక్కడ నేరాలు చేసి తప్పించుకుంటున్నారు. సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అనుమానితులను ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించం. – జి.శంకర్‌రాజు, డీఎస్పీ జహీరాబాద్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జహీరాబాద్‌లో గన్‌ కల్చర్‌..!
జహీరాబాద్‌లో గన్‌ కల్చర్‌..!
జహీరాబాద్‌లో గన్‌ కల్చర్‌..!

ట్రెండింగ్‌

Advertisement