e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home మెదక్ గ్రామాల్లో ఘనంగా బోనాలు

గ్రామాల్లో ఘనంగా బోనాలు

ఝరాసంగం, ఆగస్టు 4: ఝరాసంగం, తుమ్మన్‌పల్లి గ్రా మాల్లో మైసమ్మ, దుర్గాదేవికి గ్రామస్తులు, భక్తులు బుధవారం ఘనంగా బోనాలు నిర్వహించారు. అమ్మవార్ల దర్శ నం కోసం గ్రామంతోపాటు చుట్టుపక్కలనుంచి భక్తులు భారీగా రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారిం ది. ఊరడమ్మ, పోచమ్మ భూలక్ష్మమ్మ, హనుమాన్‌ దేవాలయంలో పూజలు చేశారు. ఆలయ గర్భగుడిలో వెలిసిన అమ్మవార్లకు కుంకుమార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకం, ఆకు పూజలతో ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం పురవీధుల గుండా బాజాభజంత్రీలతో పటాకులు కాలుస్తూ మహిళలు బోనాలు తలపై పెట్టుకుని ఆడుతూ ఊరేగింపు కొనసాగింది. కార్యక్రమంలో సర్పంచులు బొగ్గుల జగదీశ్వర్‌, నవాజ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ పెంటయ్య, ఆయా గ్రామల భక్తులు పాల్గొన్నారు.

గుమ్మడిదలలో…
మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు. గుమ్మడిదలలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, సర్పంచ్‌ చిమ్ముల నర్సింహారెడ్డి, గ్రామస్తుల ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లికి బోనాల పండుగను నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, హోమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం, చీరె సారెతో మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం బోనాల ఊరేగింపును పోతరాజుల విన్యాసాలతో, డప్పుచప్పులతో భక్తులు బోనాలను తీసువచ్చి బోనం నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు. లింగమయ్య బోనం, పోతురాజు గావు, రంగంను వైభవంగా నిర్వహించారు. జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ మొగులయ్య, నాయకులు గోవర్దన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వేణురెడ్డి, చంద్రారెడ్డి, సూర్యనారాయణ, గ్రామపెద్దలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడంతో దుర్గమ్మతల్లి బోనా లు కనులపండువగా జరిగింది.

- Advertisement -

ఘనంగా ఫలహారం బండి ఊరేగింపు
బోనాల పండుగ ముగింపు సందర్భంగా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్‌లోని అమ్మవారి ఆలయంలో బుధవారం ఫలహారం బండి ఊరేగింపు ఘనంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, పోతరాజు విన్యాసాల నడుమ ఊరేగింపు కొనసాగింది. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమానికి 15 వార్డు కౌన్సిలర్‌, కాంగ్రెస్‌ మహిళా విభాగం సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపి, మున్నా, విజయ్‌, నాయకులు కే.శ్రీనివాస్‌, లింగంగౌడ్‌, సత్యనారాయణ, కుమ్మరి మహేశ్‌, మల్లేశ్‌, మహేశ్‌ ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana