e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home మెదక్ గోదావరి జలాలతో సస్యశ్యామలం

గోదావరి జలాలతో సస్యశ్యామలం

గోదావరి జలాలతో సస్యశ్యామలం

నర్సాపూర్‌,జూలై 16: రానున్న రోజుల్లో గోదావరి జలాలతో నర్సాపూర్‌ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారబోతుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పలు శాఖల అధికారులు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని వెల్లడించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని గిరిజన తండాలకు లింకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అదే విధంగా దసరా నుంచి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల మం జూరు అవుతాయని అన్నారు. కేజీవీల్స్‌ ట్రాక్టర్లు రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేయాలని ఎస్సై , తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ జ్యోతి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనసూయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, వైస్‌ ఎంపీపీ నర్సింగరావు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

పల్లె ప్రగతిని నిరంతరం కొనసాగించాలి..
అధికారులు రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్‌ అన్నారు. మనోహరాబాద్‌లో సాధారణ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో విద్యుత్‌ సమస్య ఏర్పడుతుందని అధికారు లు రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. సీజనల్‌ వ్యాధు లు ప్రభలకుండా కాల్వలు శుభ్రంగా చేయాలని, వైద్యసిబ్బంది గ్రామా ల్లో సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కో రారు. మహిళా సంఘాల తో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంటి తో పాటు పల్లె ప్రగతి ప్రాముఖ్యతను వివరించాలన్నారు.పల్లె ప్రగతిని నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు తెలిపారు. లక్ష్యానికంటే ఎక్కు వ సంఖ్యలో మొక్కలను నాటాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధం గాఆర్థికంగా ఎదిగేందుకు మహి ళా సం ఘాలకు ప్రభుత్వం రుణాలను అందించి ప్రోత్సహిస్తుందని ఏపీఎం పెంటాగౌడ్‌ అన్నారు. రూ.7 కోట్ల రుణాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మండలంలో రూ. 16 లక్షల రుణాలను అందించి పండ్ల దుకాణం, టిఫిన్‌ సెంటర్‌, టెంట్‌హౌజ్‌ వ్యాపారాలను పెట్టించామన్నారు కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గోదావరి జలాలతో సస్యశ్యామలం
గోదావరి జలాలతో సస్యశ్యామలం
గోదావరి జలాలతో సస్యశ్యామలం

ట్రెండింగ్‌

Advertisement