e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home మెదక్ గొల్లకుర్మల సంక్షేమానికి సీఎం కృషి

గొల్లకుర్మల సంక్షేమానికి సీఎం కృషి

గొల్లకుర్మల సంక్షేమానికి సీఎం కృషి
  • ఎమ్మెల్యే మహారెడ్డిభూపాల్‌రెడ్డి
  • ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా సంబురాలు
  • సీఎం కేసీఆర్‌,మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు

నారాయణఖేడ్‌, జూలై 22 : ప్రభు త్వం గొల్లకుర్మల సంక్షేమానికి కృషి చే స్తున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీకి నిధులు విడుదల చేయడంతోపాటు గొర్రెల యూనిట్‌ ధర పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం నారాయణఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గొల్ల, కురుమ, యాదవు సంఘాల నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీతో గొల్ల, కురుమ, యాదవుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని సన్మానించి గొర్రెపిల్లను బహూకరించారు. కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జుర్రు నర్సింహులు యాదవ్‌, నాయకులు జైపాల్‌యాదవ్‌, లక్ష్మణ్‌, పెంటయ్య, గోపాల్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
గొల్లకుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం ఆధ్వర్యంలో మెదక్‌ పట్టణంలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా గంగారాం మాట్లాడుతూ గొల్లకుర్మల సంక్షేమానికి కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పవన్‌, శేఖర్‌, విఠల్‌, సాయిలు, రాజు, మల్లేశం, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, బాలయ్య, నరేశ్‌, బాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

సీఎం కేసీఆర్‌తోనే యాదవులకు గుర్తింపు
సమాజంలో ఆర్థికంగా వెనుకబ డిన యాదవ కులస్తులకు సీఎం కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని యాదవ సంఘం అధ్యక్షుడు చిలుక మల్లేశ్‌యాదవ్‌ అన్నారు. గొర్రెలు, మేకల పెంపకానికి గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా రూ.50 వేలు పెంచడంపై సంతోషం వ్యక్తం చేస్తూ తూప్రాన్‌ పట్టణంలోని నర్సాపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు రమేశ్‌యాదవ్‌, అంజయ్యయాదవ్‌, మెట్టు రమేశ్‌యాదవ్‌, ఆబోతువెంకటేశ్‌యాదవ్‌, గడ్డి మల్లేశ్‌, గడ్డి ఐలేశ్‌యాదవ్‌ పాల్గొన్నారు.

కురుమలను గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ కుర్మలను గుర్తించి విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదగడానికి కృషి చేస్తున్నారని కుర్మ సంఘం యూత్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు కోటగిరి ప్రభాకర్‌ అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమం లో కరుమ సంఘం నేతలు చంద్రం, శ్రీకాంత్‌, కనకయ్య, స్వామి, మల్లయ్య, అంజయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గొల్లకుర్మల సంక్షేమానికి సీఎం కృషి
గొల్లకుర్మల సంక్షేమానికి సీఎం కృషి
గొల్లకుర్మల సంక్షేమానికి సీఎం కృషి

ట్రెండింగ్‌

Advertisement