e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home మెదక్ అభివృద్ధివల్లి చాట్లపల్లి

అభివృద్ధివల్లి చాట్లపల్లి

  • పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
  • ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం
  • అందుబాటులో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు
  • హరితహారంలో పెద్దఎత్తున మొక్కల పెంపకం
  • నిరుపేదలకు ‘డబుల్‌’ ఇండ్లు..

జగదేవ్‌పూర్‌, జూలై 14 : సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని గ్రామంలో కోట్లా ది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులతో ప్రగ తి ముంగిట నిలిచింది. సీఎం కేసీఆర్‌ మం జూరు చేసిన రూ.1.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామం స్వరూపమే మారింది. గల్లీగల్లీకి సీసీరోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలతో అందంగా తయారైంది. పల్లె ప్రగతి కార్యక్రమం 100 శాతం విజయవంతమైంది. గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా కలిగి ఉన్నారు. గ్రామంలో మొత్తం 335 కుటుంబాలు ఉండగా, 1604 మంది జనాభా ఉన్నారు. 798 పురుషులు, 806మంది ్రస్త్రీలు ఉన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాల 1 అంగన్‌వాడీ కేంద్రం ఉంది. 214మంది పింఛన్‌దారులు ఉన్నారు.

గ్రామంలో ప్రగతి పనులు..
గ్రామంలో గలీగల్లీకి సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు నిర్మించారు. మూ డు ట్యాంకులతో ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు. పంచాయతీ భవనం, మహి ళా సమైఖ్య భవనం, యువజన గ్రంథాలయ భవనాలు నిర్మాణం చేపట్టారు. నిరుపేదల కోసం 31 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, శుభకార్యాలకు ఫంక్షన్‌హాల్‌ ఏర్పాటు చేశారు. రైతువేదిక భవన నిర్మాణం చివరి దశలో ఉంది. ప్రతిరోజూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. చాట్లపల్లి నుంచి వట్టిపల్లి వైపు, అంతాయగూడెం, కొండపోచమ్మ దేవాలయం రోడ్లు వెంబడి పెద్దఎత్తున మొక్కలు నాటారు.

- Advertisement -

అందమైన రహదారులు..
గ్రామానికి మూడు జిల్లాలను కలుపుతూ డబుల్‌ రోడ్లు వేశారు. చాట్లపల్లి నుంచి 30కిలో మీటర్ల దూరంలో ఉన్న భువనగిరి యాదాద్రి జిల్లాకు సరిహద్దు గ్రామం సాల్వాపూర్‌ సింగారం వరకు బీటీ రోడ్డు వేశారు. జగదేవ్‌పూర్‌ నుంచి చాట్లపల్లి మీదుగా కొండపోచమ్మ దేవాలయానికి డబుల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రాజీవ్‌ రహదారి నుంచి చిన్నకిష్టాపూర్‌ మీదుగా నాగపురి వరకు డబుల్‌ రోడ్లు నిర్మించారు. ఏండ్ల నాటి రోడ్ల ఇబ్బందులు పోయాయాని ప్రజలు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

30 రోజుల ప్రణాళికతో సమూల మార్పు..
30 రోజుల ప్రణాళికతో గ్రామంలో సమూల మార్పు వచ్చింది. గ్రామస్తులు, యువకుల సహకారంతో అధికారులు పర్యవేక్షణతో గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రమాదకర బావులను పూడ్చారు. పాత ఇండ్లను కూల్చివేశారు. వార్డు సభ్యులు, నాయకులు యువకులతో కలిసి శ్రమదాన కార్యక్రమాలు చేపట్టారు.

అద్భుతంగా పల్లె ప్రకృతి వనం..
గ్రామంలోని ప్రధాన రోడ్డు వెంబడి ఎకరం విస్తీర్ణంలో సుమారు రూ.7.50 లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనంలో 300 రకాల మొక్కలు నాటారు. పార్కులో పూలు పండ్లు, ఔషధ మొక్కలు ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ఆట వస్తువుల ఏర్పాటుతో పాటు గోడలపై అందమైన జంతువులు, పక్షుల బొమ్మలు వేయించారు. యువకుల కోసం ప్రత్యేకంగా అన్ని రకాల జిమ్‌ పరికరాలు ఏర్పాటు చేశారు. వృద్ధుల కోసం సిమెంట్‌ కుర్చీలు, వాకింగ్‌ ట్రాక్‌లు ఉన్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana