e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home మెదక్ అప్రమత్తతే ఆయుధం

అప్రమత్తతే ఆయుధం

అప్రమత్తతే ఆయుధం


వేసవి మంటలతో జరజాగ్రత్త
ప్రమాదాల నివారణకు సిద్ధంగా ఉన్న అగ్నిమాపక కేంద్రం అధికారులు
ఈ ఏడాదిలో106 ప్రమాదాలు
మెదక్‌ జిల్లాలో నాలుగు అగ్నిమాపక కేంద్రాలు

మెదక్‌రూరల్‌, ఏప్రిల్‌ 11: ఎండాకాలం వచ్చిందంటేచాలు అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తినష్టం జరుగుతుంటుంది. ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో అగ్గి రవ్వ రాజుకుంటే ఆప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మంటలు క్షణాల్లో వ్యాప్తిచెంది స్పందించే లోపే ఘోరం జరిగే అవకాశం ఉంటుంది. ఆస్తినష్టంతోపాటు కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా తప్పకపోవచ్చు.

అవగాహన కార్యక్రమాలు
అగ్ని ప్రమాదాలు నివారించేందుకు మెదక్‌ జిల్లాలో ముందస్తుగానే చర్యలు చేపట్టింది. విద్యాసంస్థలు, పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన నిర్వహించారు. ప్రమాదాల నివారణకు సంబంధించిన కిట్లను ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, మండే పదార్థాలు అందుబాటులో ఉంచొద్దు
కాలిన సిగరెట్లు, బీడీలు, అగ్నిపుల్లలు ఆర్పకుండా పారేయవద్దు
సిలిండర్‌కు పాడైన గ్యాస్‌ ట్యూబ్‌ను తొలిగించి ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న కొత్తది వేయాలి. సిలిండర్‌ వాడకం పూర్తయ్యాక రెగ్యులేటర్‌ను ఆపేయాలి
దవాఖానలు, దుకాణ సముదాయాల్లో ఆర్‌సీసీ, కాంక్రీట్‌ స్లాబ్‌లను మాత్రమే పైకప్పుగా వాడాలి. ఫైర్‌ అలారం, ఫైర్‌ స్మోక్‌ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలి.
పరిశ్రమల వద్ద తగినంత నీరు, ఇతర అగ్నిమాపక సాధనాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
వాహనాల్లో గడ్డిని తీసుకెళ్లేటప్పుడు ఎక్కువ ఎత్తులోఉండడంతో విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాలి.
స్విమ్మింగ్‌ రాని పిల్లలు, యువత చెరువులు, డ్యామ్‌లు, కాలవలకు దూరంగా ఉండాలి.
ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అప్రమత్తతే ఆయుధం

ట్రెండింగ్‌

Advertisement