మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Sep 09, 2020 , 18:33:47

ఇద్ద‌రు స‌ర్పంచ్‌లు, ఒక ఉప‌స‌ర్పంచ్‌పై వేటు

ఇద్ద‌రు స‌ర్పంచ్‌లు, ఒక ఉప‌స‌ర్పంచ్‌పై వేటు

నెట్‌వ‌ర్క్ న‌మ‌స్తే తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ సర్పంచ్ సున్నం సుశీల ఇసుక క్వారీల ద్వారా వచ్చిన డ‌బ్బును తన వ్యక్తిగత ఖాతాలో వేసుకుంటుంద‌ని వార్డు స‌భ్యులు ఆమెపై క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. విచార‌ణ అనంత‌రం ఆమెను ఆరు నెల‌ల పాటు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎంవీ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

అదే జిల్లాలోని మంగపేట సర్పంచ్ సుజాత భర్త, కుమారుడు క‌లిసి పంచాయ‌తీ కార్యదర్శిపై దాడికి పాల్ప‌డిన‌ట్లు క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు రావ‌డంతో విచార‌ణ అనంత‌రం స‌ర్పంచ్ సుజాత‌ను కూడా స‌స్పెండ్ చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. అదే విధంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి ఉప సర్పంచ్  దమ్మని సత్తయ్యను నిధుల వినియోగంపై స‌హ‌క‌రించ‌డం లేద‌ని స‌ర్పంచ్ ఫిర్యాదు మేర‌కు స‌స్పెండ్ చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ భార‌తి తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo