e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News గిరిజ‌నుల‌కు మంచిర్యాల పోలీసుల నిత్యావ‌స‌రాల పంపిణీ

గిరిజ‌నుల‌కు మంచిర్యాల పోలీసుల నిత్యావ‌స‌రాల పంపిణీ

గిరిజ‌నుల‌కు మంచిర్యాల పోలీసుల నిత్యావ‌స‌రాల పంపిణీ

మంచిర్యాల : కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీసులు ఆదివారం తాండూర్ మండలంలోని మారుమూల నర్సాపూర్ గ్రామంలో గిరిజన ప్రజలకు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయ‌ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉంటూ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని గిరిజ‌నుల‌ను కోరారు. ప్ర‌జ‌ల‌కు పోలీసులు త‌మ స‌హ‌కారాన్ని ఎల్ల‌ప్పుడూ అందిస్తార‌న్నారు. స‌మ‌స్య‌లేవైనా ఉంటే పోలీసుల‌తో పంచుకోవాల‌ని తెలిపారు. నిత్యావ‌స‌రాలు అందించిన స్థానిక పోలీసుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. ఈ కార్య‌క్ర‌మంలో బెల్లంప‌ల్లి ఏసీపీ రెహ‌మాన్‌, తాండూర్ ఇన్‌స్పెక్ట‌ర్ కె.బాబు రావు, మాదారం స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ మాన‌స పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గిరిజ‌నుల‌కు మంచిర్యాల పోలీసుల నిత్యావ‌స‌రాల పంపిణీ

ట్రెండింగ్‌

Advertisement