e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home ఆదిలాబాద్ ధాన్యానికి ‘మద్దతు’ పొందండిలా..

ధాన్యానికి ‘మద్దతు’ పొందండిలా..

మంచిర్యాల అర్బన్‌, నవంబర్‌ 25 : జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేర్చుతున్నారు. ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యానికి రూ. 1960 చెల్లిస్తుండగా, సాధారణ రకానికి రూ. 1940 చెల్లిస్తున్నది. ఈ సమయంలో పండించిన ధాన్యానికి మద్దతు ధర పొందడానికి పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్‌ కుమార్‌ రైతులకు పలు సూచనలు చేశారు.

 • ఒక రకం ధాన్యాన్ని మరో రకం ధాన్యంతో కలుపకూడదు.
 • పంట కోసిన తర్వాత ఆరబెట్టాలి. లేకపోతే గింజలు రంగు మారి నాణ్యత కోల్పోతాయి. పూర్తిగా ఆరబెట్టిన తర్వాత కేంద్రాలకు తీసుకురావాలి.
 • ధాన్యంలో రాళ్లు, మట్టి గడ్డలు కలుపకుండా నేల మీద పరదాలు లేదా టార్పాలిన్లు వేసి వాటిపై కుప్పలుగా పోయాలి.
 • పంటలో తాలు, తప్ప, పొల్లు, చెత్తా చెదారం లేకుండా తూర్పారబట్టాలి.
 • నిలువ ఉంచిన ధాన్యాన్ని ఎలుకలు నాశనం చేయకుండా బస్తాల మధ్యన జింకు సల్ఫేట్‌ మాత్రలు, పురుగు నివారణకు లీటర్‌ నీటికి ఐదు మిల్లీ లీటర్లు మలాథియాన్‌ మందును బస్తాలపై పిచికారీ చేయాలి.
 • ధాన్యం ముక్కిపోయి రంగుమారి నాణ్యత పడిపోకుండా తేమ బాగా తగ్గాకే బస్తాల్లో నింపి లాటుగా వేయాలి.
 • రైతులు ధాన్యపు పంట నుంచి సుమారు కిలో ధాన్యం మచ్చు(శాంపిల్‌) కింద ప్రాథమిక పరిశీలన కోసం కొనుగోలు కేంద్రానికి ముందుగా తీసుకెళ్లి నాణ్యత పరీక్ష అధికారికి చూపించి తగు సలహా పొందాలి.
 • ధాన్యం కొనుగోలు కేంద్రంలో శాంపిల్‌ తీసుకున్న అధికారి నాణ్యతకు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రానికి తరలించాలి.
 • రైతు తనే పంట పండించిన భూమి సర్వే నంబర్‌, విస్తీరణ వివరాలు తెలియజేస్తూ అధికారి నుంచి గుర్తింపు పత్రం తీసుకొని ధాన్యం కొనుగోలు కేంద్రానికి దాఖలు చేయాలి.
 • దళారులు, మధ్యవర్తులు కమీషన్‌ ఏజెంట్లు చొరబాటు లేకుండా నివారించేందుకు నేరుగా పంట పండించిన రైతులకే ప్రభుత్వం గిట్టుబాటు ధర వర్తింపజేసేందుకు ఈ నిబంధనలు పాటించాలి.
 • రైతులకు నాణ్యతా ప్రమాణాలపై ఏమైనా సందేహాలుంటే సంబంధిత మండల వ్యవసాయాధికారి(ఎంఏవో) లేదా వ్యవసాయ విస్తీరణ అధికారి(ఏఈవో)లను సంప్రదించాలి.
 • నాణ్యతా ప్రమాణాలు ఇలా…
 • మట్టి రాళ్లు, ఇసుక వ్యర్థాలు ఉండకూడదు.
 • గడ్డి, చెత్త, తప్ప, కలుపు విత్తనాలు ఒక్క శాతం మించకూడదు.
 • చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగు పట్టిన ధాన్యం గింజలు ఐదు శాతం మించకూడదు.
 • పరిపక్వంగాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యం గింజలు మూడు శాతంలోపే ఉండాలి.
 • తేమ లేక నిమ్ము 17 శాతానికి మించి ఉండవద్దు.

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి..

- Advertisement -

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రైతులు ఏమైనా సందేహాలుంటే వ్యవసాయాధికారులను సంప్రదించాలి. అధికారుల సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలి.
-ప్రేమ్‌కుమార్‌, డీసీఎస్‌వో, మంచిర్యాల

గణనీయంగా తగ్గించాం..

నిర్మల్‌ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తేవడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. 2018లో 18శాతం ఉన్న నష్టాన్ని ఇప్పుడు 11శాతానికి తగ్గించాం. ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా, ఫొటో వాట్సాప్‌ గ్రూపులో పంపితే చాలు పది నిమిషాల్లోనే సిబ్బంది అక్కడికి చేరుకుంటున్నారు. మరమ్మతులు చేసి, పూర్తి స్థాయి నష్టాన్ని పూర్తిగా నియంత్రించగలుగుతున్నాం.

 • శ్రీనివాస్‌రావు, ఏఈ, నిర్మల్‌

పారదర్శకమైన సేవలు..
విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ ఫిర్యాదు విభాగాన్ని అమలు చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లకు గుర్తింపు నంబర్లను కేటాయించాం. అక్కడ ఏ సమస్య వచ్చినా ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తే పరిష్కరించేందుకు కృషిచేయడం జరుగుతుంది. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.

 • జయవంత్‌రావు చౌహాన్‌, (జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి, నిర్మల్‌)

వెంటనే స్పందిస్తున్నారు.
పంట పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లలో సమస్య వచ్చినా, కాలిపోయినా ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తే పది నిమిషాల్లోనే సిబ్బంది వస్తున్నారు. కాలిపోతే వారి సొంత వాహనంలోనే నిర్మల్‌కు తీసుకెళ్లి, కొత్తది తెచ్చి అమర్చుతున్నారు. ఓవర్‌లోడ్‌ ఉన్న చోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కాలిపోతే రెండు నుంచి మూడురోజులు పట్టేది. ఇప్పుడు 24 గంటల్లోనే మంచిగ చేస్తున్నరు.

 • రాములు, రైతు, కుంటాల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement