కాకః కృష్ణః పికః కృష్ణః కోభేదః పిక కాకయోః
వసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః
తా॥ కాకి నల్లగానే ఉంటుంది. కోకిల నల్లగానే ఉంటుంది. సామాన్య దృష్టితో చూస్తే మాత్రం రెండింటిలో పెద్దగా భేదం కనబడదు. వసంత ఋతువు రాగానే కాకి గూటిలో పుట్టి, కాకి పోషణలో పెరిగిన కోకిల మాత్రం తన మధుర గానంతో అందరిని మైమరపింపజేస్తుంది. కాకి మాత్రం కాకిగానే ఉండిపోతుంది. అందుకే ‘కవి కోకిల’ ‘గాన కోకిల’లు మాత్రమే అవతరించినారు.
టి.సుధాకరశర్మ