బుధవారం 03 మార్చి 2021
Mancherial - Feb 22, 2021 , 02:46:30

పార్టీకి కార్యకర్తలే పునాది

పార్టీకి కార్యకర్తలే పునాది

బెల్లంపల్లిటౌన్‌, ఫిబ్రవరి 21 : టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే పునాది అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నా రు. ఆదివారం పట్టణంలోని 15, 28, 33, 34వ వార్డుల్లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్య క్షుడు బొడ్డు నారాయణ, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, పోలు ఉమాదేవి, రామగిరి రామకృష్ణ, చిట్యాల శ్రీలక్ష్మి, కీంశెట్టి సరిత, నాయకులు  నెల్లికంటి శ్రీధర్‌, నెల్లి రమేశ్‌, చిట్యాల మధు, కీంశెట్టి శ్రీనివాస్‌, తడిక రమేశ్‌ పాల్గొన్నారు. 

మంచిర్యాలటౌన్‌, ఫిబ్రవరి 21 : టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమో దు కార్యక్రమం పండగ వాతావరణంలో ఉత్సాహంగా కొన సాగుతున్నది. మంచిర్యాల ఎనిమిదో వార్డు పాతమంచిర్యాల లో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ సభ్యత్వాలను చేయించా రు. 16వ వార్డు అశోక్‌రోడ్‌లో కౌన్సిలర్‌ బోరిగం శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యుడు మామిడిశెట్టి రమేశ్‌ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కుంటాల శంకర్‌, గడ్డం రాజేశ్‌, శంకర్‌, మేరుగు అశోక్‌, కొప్పర్తి భాస్కర్‌, పెండెం సు రేందర్‌, నడిపెల్లి శ్రీనివాస్‌, సదానందం గోపి పాల్గొన్నారు. 

చెన్నూర్‌, ఫిబ్రవరి 21 : సభ్యత్వ నమోదు కార్యక్రమం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తుల సమ్మయ్య, మున్సిపల్‌ చైర్‌ప ర్సన్‌ అర్చనా గిల్డా, ఇన్‌చార్జిలు గట్టాగౌడ్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు అజ్గర్‌ వార్డుల వారీగా టీఆర్‌ఎస్‌ నాయకులతో కలి సి నిర్వహించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నవాజొద్దీన్‌, కౌన్సి లర్‌ వేల్పుల సుధాకర్‌, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు అయూ బ్‌, నాయకులు రాంలాల్‌ గిల్డా, జాడి తిరుపతి, నాయిని సతీశ్‌, మేడ సురేశ్‌రెడ్డి, కాగితపు రాజేశ్‌, నయీం, సాదిక్‌, ఇర్ఫాన్‌, షఫియోద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు. 

వేమనపల్లి, ఫిబ్రవరి 21 : మంగెనపల్లి గ్రామంలో టీఆర్‌ ఎస్‌ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి సభ్యత్వం స్వీకరించారు. సర్పంచ్‌ కుబిడె మధుకర్‌, మాజీ ఎంపీపీ వెంకటేశం, నాయకులు లక్ష్మణ్‌, బాపురెడ్డి, రాజబా పు, రమేశ్‌రెడ్డి, పోచ్చిరెడ్డి, ప్రశాంత్‌ పాల్గొన్నారు. 

జైపూర్‌, ఫిబ్రవరి 21 : మండల కేంద్రంతోపాటుగా ముది గుంట, మిట్టపెల్లి, గంగిపెల్లి, శెట్‌పల్లి, ఎల్కంటి, టేకుమట్ల గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వ హించారు. కాగా ఇందారం, గంగిపెల్లి, కుందారం గ్రామాల్లో సభ్యత్వబుక్కులు, నగదు అందజేశారు. టీఆర్‌ఎస్‌ మండల ఇన్‌చార్జి కరుణసాగర్‌, జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీపీ గోదా రి రమాదేవి, నాయకులు సురేందర్‌ రెడ్డి, బల్మూరి అరవింద రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండు తిరుపతి పాల్గొన్నారు. 

మంచిర్యాలటౌన్‌(శ్రీరాంపూర్‌), ఫిబ్రవరి 21 : నస్పూర్‌ మున్సిపల్‌ పరిధిలో 3వ వార్డులో కౌన్సిలర్‌ పంబాల గంగా ఎర్రయ్య, 6వ వార్డు ఆర్కే 8కాలనీలో కౌన్సిలర్‌ పూదరి కు మార్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ బాకం నగేశ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ముత్తె రాజేశ్‌, మాజీ సర్పంచ్‌ తిప్పని రామయ్య, మాజీ ఉప సర్పంచ్‌ ముక్కెర వెంకటేశ్‌, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ కార్యదర్శి ఇండ్ల కిరణ్‌కుమార్‌, చెల్ల విక్రం,  నోముల నరేందర్‌రెడ్డి, ఆర్‌ రాజ య్య, రామగిరి మల్లయ్య, శ్రీనివాస్‌ పోచయ్య, కందుల ప్రశాంత్‌, దగ్గుల మధు, వెంకటేశ్‌, బాబురావు పాల్గొన్నారు. 

దండేపల్లి, ఫిబ్రవరి 21 : చింతపెల్లి, తాళ్లపేట, మేదరిపేట గ్రామాల్లో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సభ్యత్వా న్ని అందజేశారు. వైస్‌ ఎంపీపీ అనిల్‌, సర్పంచ్‌ లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌  నాయకులు, తదితరులు ఉన్నారు.

బెల్లంపల్లిరూరల్‌, ఫిబ్రవరి 21 : సోమగూడెం పంచాయతీ లో సర్పంచ్‌ కొరకొప్పుల ప్రమీలాగౌడ్‌ ఆధ్వర్యంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీని వాస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా సర్పంచ్‌కు సభ్యత్వాన్ని అందజేశా రు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింగం గణేశ్‌గౌడ్‌, మార్కె ట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఎం రాజశేఖర్‌, దుర్గం గోపాల్‌, రవి పాల్గొన్నారు.

కోటపల్లి, ఫిబ్రవరి 21 : జనగామ, మల్లంపేట, బొప్పారం, సిర్స, పుల్లగామ, ఆలుగామ గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకుల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సభ్యత్వ ఇన్‌చార్జిలు బత్తుల సమ్మ య్య, మంత్రి బాపు, సర్పంచ్‌లు గట్టు లక్ష్మణ్‌ గౌడ్‌, అక్కల మధుకర్‌, జెల్ల సతీశ్‌, సుమలత, కుమ్మరి సంతోష్‌, ఎంపీటీసీ మారిశెట్టి తిరుపతి, చంద్రగిరి శంకర్యయ్య, పెద్దిం టి పున్నం చంద్‌, నాయకులు ఓదెలు, సల్పాల పోచం పాల్గొన్నారు.

మందమర్రి, ఫిబ్రవరి 21 : మున్సిపల్‌ పరిధిలోని 16, 17, 18, 19 వార్డుల్లో విద్యానగర్‌, దీపక్‌నగర్‌, అంగడిబజార్‌, శ్రీపతినగర్‌ ఏరియాలో సభ్యత్వ ఇన్‌చార్జి వాల శ్రీనివాస్‌ రా వు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిం చారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎస్‌ ప్రభాకర్‌రావు, జే రవీందర్‌, మేడి పల్లి సంపత్‌, బడికెల సంపత్‌, కొంగల తిరుపతిరెడ్డి, రాగిడి రాంరెడ్డి, తోట సురేందర్‌, మేడిపల్లి మల్లేశ్‌, భట్టు రాజ్‌కుమార్‌, ప్రతాప్‌ సారంగపాణి, బర్ల సదానందం, రమేశ్‌, శ్రీను, కొంరయ్య, నరేశ్‌, రాజేందర్‌, రాకేశ్‌గౌడ్‌, రజిత, తిరుపతమ్మ, అమృత, లక్ష్మి, చిన్ని పాల్గొన్నారు. 

జన్నారం, ఫిబ్రవరి 21 : దేవునిగూడ, చర్లపల్లెలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, బాపురెడ్డి, రాజన్న, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

VIDEOS

logo